Share News

Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

ABN , Publish Date - May 20 , 2025 | 07:21 PM

Borugadda Anil: బోరుగడ్డ అనిల్ 2016 మే 9వ తేదీన పెదకాకాని మండల సర్వేయర్ మల్లిఖార్జునరావును స్థలం సర్టిఫికేట్ కోసం బెదిరించాడు. దీంతో విధులకు ఆటంకం కలిగిస్తూ తనను బెదిరించటంపై మల్లిఖార్జునరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
Borugadda Anil

సర్వేయర్‌ను బెదిరించిన కేసుకు సంబంధించి గుంటూరు కోర్టు రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. బోరుగడ్డ అనిల్ 2016 మే 9వ తేదీన పెదకాకాని మండల సర్వేయర్ మల్లిఖార్జునరావును స్థలం సర్టిఫికేట్ కోసం బెదిరించాడు. దీంతో విధులకు ఆటంకం కలిగిస్తూ తనను బెదిరించటంపై మల్లిఖార్జునరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అప్పటినుంచి కేసు నడుస్తూ ఉంది. గత ఎనిమిదేళ్ల నుంచి అనిల్ కోర్టుకు హాజరుకావటం లేదు. ఈ కేసుకు సంబంధించి అధికారులు చర్యలకు సిద్ధం అయ్యారు. అనంతపురం జైలులో ఉన్న అనిల్‌ను.. పీటీ వారెంట్ మీద గుంటూరు కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టు వచ్చే నెల 3వరకు అనిల్‌కు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.


సీఐ కేసులో బోరుగడ్డకు బెయిల్

అనంతపురం త్రీటౌన్‌ సీఐ మురళీకృష్ణను బెదిరించిన కేసులో రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కు కొద్దిరోజుల క్రితం బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో విచారణ కోసం అనంతపురం జిల్లా జైలు నుంచి బోరుగడ్డ అనిల్‌ను గత గురువారం స్పెషల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. ఇన్‌చార్జి న్యాయాధికారి హారిక రావూరి.. బోరుగడ్డకు బెయిల్‌ మంజూరు చేశారు.


ఇవి కూడా చదవండి

Hyderabad: మాయ లేడీలు.. పెళ్లి చేస్తానంటే నమ్మాడు.. పెళ్లి రోజు ఊహించని షాక్..

Bullet Train: సరికొత్త టెక్నాలజీతో బుల్లెట్ ట్రైన్ బ్రిడ్జి నిర్మాణం..

Updated Date - May 20 , 2025 | 07:29 PM