Home » Gujarat
గుజరాత్‌లోని ఓ గ్రామంలో బావి మిస్టరీ ప్రజలను భయపెడుతోంది. బావిలోని నీళ్లు అటు, ఇటు వేగంగా కదులుతుండటంతో గ్రామంలో కలకలం చెలరేగింది. ఏదో వినాశనం జరగబోతోందని గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
స్నేహితులను గుడ్డిగా నమ్మిన ఓ వ్యక్తి దారుణంగా మోసపోయాడు. స్నేహితుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
మాలిలో ఓ భారతీయ వ్యాపారి కిడ్నాప్‌కు గురయ్యారు. వ్యాపారిని విడిచిపెట్టాలంటే.. 44 కోట్ల రూపాయలు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. కుటుంబసభ్యులు 44 కోట్ల రూపాయలు చెల్లించి వ్యాపారిని కిడ్నాపర్ల చెరనుంచి విడిపించుకున్నారు.
గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. వల్సాడ్ జిల్లాలో వరదల కారణంగా పార్కింగ్‌లో ఉన్న 50కిపైగా కార్లు నీట మునగగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
దేశీయ రక్షణ, విమాన తయారీ రంగాల్లో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. తొలి స్వదేశీ ఎయిర్‌బస్ సీ-295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిచయం చేశారు.
గుజరాత్‌లోని ఖేడాలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్తుండగా ఓ బాలుడిపై కరెంట్ స్తంభం కూలి మీదపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆరుగురు అక్కాచెల్లెళ్లకు ఒక్కడే సోదరుడు కావడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సరికొత్త హరిత విప్లవం ప్రారంభమైంది. నగరం అంతటా 50 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న'మిషన్ 5 మిలియన్ ట్రీస్' కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు.
సింహం దాడిలో ఓ 11 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన గుజరాత్‌లో తాజాగా వెలుగుచూసింది.
దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక కోర్టు 2022లో విధించిన శిక్షలను సమర్థిస్తూ 38 మంది దోషులకు ఉరిశిక్షను, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు మంగళవారం ఖరారు చేసింది.
గుజరాత్ భావ్‌నగర్ జిల్లాలో పలిటానా తాలూకాలోని గరజియా గ్రామంలో పశువుల కాపరిపై సింహం దాడి చేసింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.