Share News

GIFT City: ఇండియాలో ఈ సిటీ 50 ఏళ్ళు ముందుకు ఉంది.. ఎక్కడో తెలుసా?

ABN , Publish Date - Dec 10 , 2025 | 12:47 PM

ప్రపంచ స్థాయి భవనాలు, అత్యాధునిక సాంకేతికతలు, మెరుగైన మౌలిక వసతులతో గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ టెక్ సిటీ (గిఫ్ట్ సిటీ)ని ప్రపంచ వ్యాపారం కోసం అత్యాధునిక హుంగులతో నిర్మించారు.

GIFT City:  ఇండియాలో ఈ సిటీ 50 ఏళ్ళు ముందుకు ఉంది.. ఎక్కడో తెలుసా?
GIFT City Gujarat

ప్రపంచ స్థాయి భవనాలు, అత్యాధునిక సాంకేతికతలు, మెరుగైన మౌలిక వసతులతో గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ టెక్ సిటీ (గిఫ్ట్ సిటీ)ని ప్రపంచ వ్యాపారం కోసం అత్యాధునిక హుంగులతో నిర్మించారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్-అహ్మదాబాద్ మధ్య సబర్మతీ నదిని ఆనుకుని 886 ఎకరాల్లో ఈ నగరాన్ని నిర్మించారు (GIFT City Gujarat).


గిఫ్ట్ సిటీలో విద్యుత్, నీటి సరఫరా, చెత్త సేకరణ కోసం సెంట్రల్ యుటిలిటీ టన్నెల్‌ను భూగర్భంలో ఏర్పాటు చేశారు. అంటే అక్కడ మురుగునీటి పైప్ లైన్, ఎలక్ట్రిక్ వైర్లు బయటకు కనబడవు. అలాగే ప్రతి ఇంటికీ ఏసీ పెట్టుకునే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ కూలింగ్ సదుపాయం ద్వారా నగర పరిధిలోని ప్రతి ఇంటికి, కార్యాలయానికి ఏసీ సదుపాయం కల్పించారు. అలాగే ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాల్సిన అవసరం లేకుండా నేరుగా పైప్ లైన్‌లో వాక్యూమ్ ద్వారా సేకరిస్తున్నారు (GIFT City technology).


గిఫ్ట్ సిటీలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి (Gujarat smart city). 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతుంది. మురుగు నీటిని శుద్ధి చేసి 5 డిగ్రీలకు శీతలీకరిస్తున్నారు. ఆ నీటిని నగరంలో ఎయిర్ కండీషనింగ్ కోసం వాడుతున్నారు. ఈ ఏర్పాటు కారణంగా నగరంలో ఏసీ ఔట్ డోర్ యూనిట్లను వాడాల్సిన అవసరం ఉండదు. సాధారణ ఏసీలతో పోలిస్తే ఈ ఏర్పాటు 30 శాతం తక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. అలాగే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 10 , 2025 | 01:50 PM