Home » Governor Abdul Nazeer
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గురువారం తొలి సంతకాలు చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన ఫైళ్లపై ప్రమాణ స్వీకార వేదికపైనే సంతకం చేయాలని తొలుత భావించారు.
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అప్‌గ్రేడ్ పేరుతో ఈ-ఆఫీస్ మూసివేతపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతి: ఏపీలో కూటమి పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలో పార్టీల అధినేతలపై జరిగిన రాళ్లదాడి ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నాయి.
Andhrapradesh: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ సందేశం వినిపించారు. ‘‘మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ తెలిపారు.
ఈరోజు మంగళగిరిలో నిర్వహించిన బీసీ సదస్సులో మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram ) తెలుగుదేశం(TDP) పార్టీలో చేరారు. అయితే ఈ విషయంలో ఊహించిందే జరిగింది. జయరాంను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈసారి కూడా ఎమ్మెల్యేగా పోటీచేస్తానని వైసీపీ అధిష్ఠానానికి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ..
ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్(AP Governor Abdul Nazeer) ప్రసంగంలో విద్య, వైద్యం అంశాల గురించి ప్రస్తావించగానే టీడీపీ ఎమ్మెల్యేలు పారిపోయారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(Chellaboina venugopal krishna) అన్నారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసింది. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే గవర్నర్ స్పీచ్ కొనసాగింది. ప్రభుత్వ సంక్షేమ పధకాలను గవర్నర్‌తో ప్రభుత్వం వల్లెవేయించింది.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుకోవడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో పలు అంశాలపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ.. అనేకసార్లు నినాదాలు చేశారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. అయితే గవర్నర్ ప్రసంగంలో చెప్పిన ఓ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళన పరిస్థితి నెలకొంది.