Home » God
పచ్చని ప్రకృతి రమణీ య దృశ్యాలతో పులకిస్తోంది కోనకణ్వాశ్రమం. ఉమ్మడి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. దీనిని న్యామద్దల కోన, గుట్టూరు కోన అని కూడా పిలుస్తారు. కణ్వమహర్షి తపస్సు చేసిన స్థలం కావున కోన కణ్వాశ్రమం అనే పేరు వచ్చినట్టు పెద్దలు చెబుతుంటారు. ఈ క్షేత్రంలో ప్రముఖంగా మల్వేశ్వరస్వామి, పాం డురంగస్వామి, అయ్య ప్పస్వామి ఆంజనేయ స్వామి ఆలయాలు ఉ న్నాయి.
మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం స్వామివారు కైలాస వాహనంపై ఊరేగారు. ఆలయంలో ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభి షేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించా రు.
మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఐదోరోజు ఆదివారం దశకంఠ రావణ బ్రహ్మ వాహనం పై శివపార్వతులు ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆల యంలో ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు చేశారు.
మొదటి రోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శని వారం నీలకంఠుడు కూరగా యలతో అలంకరించిన హంస వాహనంపై సరస్వతీదేవిగా దర్శినమిచ్చాడు.
మండల పరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మూలవిరాట్‌కు క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, బంగారు కవచసేవ, పల్లకిసేవ ఆకుపూజ, అర్చనలు చేశారు.
మండలంలోని సోమదొడ్డి గ్రామ సమీపంలోని తడకలేరులో వెలసిన అశ్వత్థనారాయణస్వామి తిరునాళ్లు కన్నుల పండువగా సాగాయి. మాఘమాసం మూడో ఆదివారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారికి తెల్లవారుజామున విశేషపూజలు నిర్వహించారు.
భక్తుల కొంగుబంగారమైన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం శనివారం రాత్రి ఘనంగా సాగింది. మండల పరిధిలోని కోటంక గ్రామ సమీపంలో వెలసినస్వామి తిరునాళ్లలో భాగంగా మూడో శనివారం దేవాదయశాఖ , గ్రామస్థుల ఆద్వర్యంలో రథో త్సవం నిర్వహించారు.
మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం నగరంలోని పలు ఆలయాల్లో పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అశోక్‌నగర్‌లోని రమాసమేత సత్యనారాయణస్వామి దేవాలయం, మూడోరోడ్డు షిర్డీ సాయిబాబా ఆలయం, మల్లేశ్వరరోడ్డులోని లక్ష్మీ గణపతి మందిరాల్లో సామూహిక సత్యనారాయణ వ్రతం ఆచరించారు.
కోరిన కొర్కెలు తీర్చే కొండమీద రాయుడు స్వామి హనుమద్వాహ నంపై పురువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఐదో రోజు హనుమద్వాహ న సేవ ఆదివారం నేత్ర ప ర్వంగా సాగింది. ఉద యం స్థానిక అంజినేయ స్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామి ఉత్సవమూర్తుల కు వేద పండితులు ప్ర త్యేక పూజలు నిర్వహిం చారు.
స్థానిక కొండమీద రాయు డు స్వామి బ్రహోత్సవా లు అంగరంగ వైభవం గా జరుగుతున్నాయి. ్ఞఅందులో భాగంగా నా లుగో రోజు శనివారం శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారు శేష వాహ నంపై భక్తులకు దర్శనమి చ్చారు.