Home » GHMC
ఓ చిన్నారి వరద నీటి కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయింది. తల్లి అప్రమత్తతతో క్షేమంగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. మౌలా కా చిల్లా ప్రాంతానికి చెందిన మహమ్మద్ సల్మాన్ కుమార్తె జైనబ్ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో యూకేజీ చదువుతోంది.
అధికారులు, ఉద్యోగులకు ఇచ్చే ఎలక్ర్టానిక్ వస్తువుల సమగ్ర జాబితా డిజిటలైజ్ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇన్వెంటరీ యాప్ రూపకల్పనకు ఐటీ విభాగం కసరత్తు ప్రారంభించింది.
హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యానికి ఐదేళ్ల బాలిక మ్యాన్ హోల్లో పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై చార్మినార్ జోనల్ కమిషనర్ స్పందించారు.
కూకట్పల్లి జలమండలి పరిధిలో ఈ నెల 9, 10 తేదీల్లో నీటి సరఫరా ఉండదని జీఎం హరిశంకర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గోదావరి ఫేజ్-1 డయా వాల్వుల మార్పు పనుల్లో భాగంగా 48 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఖైరతాబాద్, కూకట్పల్లి జోన్లలో అత్యధిక నిమజ్జనాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. హుస్సేన్ సాగర్‌తోపాటు నగరవ్యాప్తంగా 20 చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు గుర్తు చేశారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక పని చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 2 లక్షల 61 వేలకు పైగా గణేష్ ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఒక్క హుస్సేన్ సాగర్‌లోనే 11వేల గణేశ్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.
ఖైరతాబాద్ విశ్వమహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్ వద్ద బడా గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణపతి శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
ఓ వ్యక్తితో కలిసి డిజిటల్ మీడియా ప్రతినిధులు హైడ్రా పేరు చెప్పి కొందరు రూ.50 లక్షలు వసూలు చేయడంతో ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైడ్రాకు ఫిర్యాదు చేయాలనుకుంటే బుద్ధభవన్‌లోని సంస్థ కార్యాలయంలో అధికారులను నేరుగా సంప్రదించాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.