Home » Gachibowli
భూభారతి లోగో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంత గొప్ప టెక్నాలజీ అయినా ప్రజలకు కనిపించదని, ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా లోగోను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ విధ్వంసంతో పాటు రూ.10 వేల కోట్ల బడా ఆర్థిక మోసం కూడా జరిగిందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి విలువ రూ.5,200 కోట్లు అని కేటీఆర్ చెబుతున్నారు. వాస్తవానికి అది బిల్లీ రావుతో కేటీఆర్ కుదుర్చుకున్న లంచం పద్దు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ అన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. 2012లో కేటాయించిన 2,185 ఎకరాల భూమి మొత్తం యూనివర్సిటీదే అని వారు ప్రకటించారు, వర్సిటీ భూములను కాపాడాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు
కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఎంత భూమి కావాలి? పరిపాలనా భవనాలు, డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కోర్సులకు అవసరమైన తరగతి గదులు, హాస్టళ్లు, మెస్‌లు, పరిశోధన విభాగాలు.. ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసేందుకు ఎంత భూమి అవసరమవుతుంది.. అంటే గతంలో నిర్దిష్టమైన ప్రమాణాలేమీ లేవు.
ఆ 400 ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)కే అప్పగించాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భూముల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి పట్టింపులకు పోవద్దన్నారు
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విషయంలో ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులను చల్లబర్చే నిర్ణయాలు తీసుకుంది.
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై నకిలీ వీడియోలు, ఫొటోలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఈ అంశంపై బాలీవుడ్ నటి దియామీర్జా స్పందించారు.
కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూమి వ్యవహారంలో కొన్ని దుష్ట శక్తులు పని గట్టుకుని తప్పుడు ప్రచారం సాగించాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
కంచ గచ్చిబౌలి భూములను హెచ్‌సీయూకే రిజిస్టర్ చేయించాలని ఆ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్‌ను కోరారు.