Home » Farmers
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు పలు గుడ్ న్యూస్‌లు చెప్పారు. ఆగస్టు 15నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, కేంద్రం రైతులకు ఇచ్చే అమౌంట్‌కు సమానంగా జమ చేస్తామన్నారు.
బీఆర్‌ఎస్ నాయకత్వ బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగిస్తే స్వాగతిస్తానని హరీశ్ రావు అన్నారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి వెళ్లిన రైతు వడదెబ్బతో కుప్పకూలాడు. ఐదు రోజులైనా పంటను కొనుగోలు చేయకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తూ ఎండదెబ్బతో ధాన్యం రాశిపైనే మృతిచెందాడు.
ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్నా విత్తనాల ప్రణాళిక తీరక రైతులు అసహనంతో ఎదురుచూస్తున్నారు. వేసవి దుక్కులతో పొలాలు సిద్ధం చేసినా, విత్తనాల లేవు సాగుపై అనిశ్చితి కలిగిస్తోంది
పాకిస్తాన్, భారతదేశం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పంజాబ్, రాజస్తాన్‌లోని పలు గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. స్థానికుల ఇళ్లు శిథిలామవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ప్రగతిని సాధించిందని, గతంలో రైతులు మరియు మిల్లర్లకు ఉన్న బకాయిలను చెల్లించడంలో కీలకపాత్ర పోషించిందని అధికారులు తెలిపారు. అకాల వర్షాలు వల్ల రైతులలో ఆందోళనలు ఉండగా, అదనపు టార్గెట్లు కేటాయించడం ద్వారా సహాయం అందించారు.
ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధమైంది. ప్రతి రైతు కుటుంబానికి రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందుతుంది. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అర్హులైన రైతుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ పథకం రాష్ట్రంలోని రైతుల జీవితాల్లో వెలుగులు నింపనుంది.
రైతులకు తెలియకుండా వారి పేర్లపై పత్తి ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి, అక్రమంగా పత్తి కొనుగోలు, విక్రయాలు నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులపై ఉచ్చు బిగుతోంది. ఆదిలాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో నకిలీ టీఆర్ పుస్తకాలు ముద్రించి మిల్లర్లకు అందించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణలో భారీ గాలివానతో పలు జిల్లాల్లో ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. మరోవైపు తీవ్రమైన ఎండలతో వడదెబ్బకు ఒకరు మృతి చెందగా, ఎన్‌హెచ్‌ఆర్సీ వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల నేల ఆరోగ్యంతోపాటు పంటలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వాటిని వినియోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం, ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు.