Home » Election Results
నాలుగు వందల పైచిలుకు లోక్‌సభ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఎన్డీయే పశ్చిమబెంగాల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 41 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది.
గత పదేళ్లుగా తిరుగు లేని ఆధిపత్యంతో దేశాన్ని పాలించిన బీజేపీకి ఈసారి ఎదురుగాలి వీస్తోంది. 350 స్థానాలు గ్యారెంటీ అని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన జోస్యాలు నిజం కాలేదు. ఈసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ మీద ఆధారపడాల్సి ఉంటుంది.
ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించాలనుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కలలు కల్లలయ్యేలా ఉన్నాయి. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు దక్కించుకోవాలనుకున్న నవీన్ పట్నాయక్ ఆశలకు బీజేపీ గండికొడుతోంది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో సోమవారం దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ఎన్నికల ఫలితాలు వస్తుండడం, ఎన్డీయే కూటమికి ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ లభిస్తుండడంతో మదుపర్లు అప్రమత్తమవుతున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అత్యంత ఉత్కంఠగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సునాయాసంగా 300కు పైగా సీట్లు సాధిస్తుందని మెజారిటీ సర్వే సంస్థలు వెల్లడించాయి. ఇండియా కూటమికి 150 సీట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి.
కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుని విశ్లేషకులకు కూడా షాకిచ్చింది. ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలకు దాదాపు రెట్టింపు సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ స్వంతంగా 100కు పైగా సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ 2014లో కేవలం 44, 2019లో 52 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.
ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ అభ్యర్థులు పైచేయి సాధించినట్లు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, నెల్లూరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఒడిశాలో నాలుగు దశలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
ఓటు సునామీతో చరిత్ర సృష్టించిన రాష్ట్రం, పోలింగ్ ఫలితాల వెల్లువకు సిద్ధమైంది. 23 రోజులుగా ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓటరు తీర్పు వెలువడే సమయం వచ్చేసింది.
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడిమిని తట్టుకోలేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న 33మంది సిబ్బంది శనివారం ఎండల కారణంగా మృతిచెందారు. వీరిలో హోంగార్డులు, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు.