Share News

Assembly Election Results 2024: ఒడిశాలో నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టిస్తారా? మెజారిటీకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు కావాలి?

ABN , Publish Date - Jun 04 , 2024 | 10:38 AM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఒడిశాలో నాలుగు దశలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

Assembly Election Results 2024: ఒడిశాలో నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టిస్తారా? మెజారిటీకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు కావాలి?
PM Modi with Odisha CM Naveen Patnaik

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఒడిశాలో నాలుగు దశలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మే 13 (28 నియోజకవర్గాలు), మే 20 (35 నియోజకవర్గాలు), మే 25 (42 నియోజకవర్గాలు), జూన్ 1 (42 నియోజకవర్గాలు) నాలుగు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఒడిశా అసెంబ్లీలో మొత్తం 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.


ఒడిశాలో నవీన్ పట్నాయక్ బిజూ జనతా దళ్ (BJD), భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఎన్నికల్లో తలపడ్డాయి. 2000వ సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా నవీన్ పట్నాయక్ విజయం సాధిస్తే దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు. 2019 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో, బీజేడీ 113 సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ 23 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్‌ కేవలం 9 స్థానాలకే పరిమితమైంది.


తాజాగా జరిగిన ఎన్నికల్లో ఒడిశాలో భారీగా పోలింగ్ నమోదైంది. మే 3న ఫేజ్ 3 ఎన్నికలు పూర్తయ్యే నాటికి 74.4 శాతం ఓటింగ్ నమోదైంది. 2019లో మొత్తం ఓటింగ్ 73.20 శాతమే. కాగా, ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా 74 స్థానాలు అవసరం. మరీ, ఈసారి కూడా గెలిచి నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టిస్తారేమో చూడాలి.

Updated Date - Jun 04 , 2024 | 10:38 AM