Share News

Lok sabha Election Result 2024: ఎన్డీయేకు ధీటుగా ఇండియా కూటమి.. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు తప్పుతాయా?

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:03 AM

కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుని విశ్లేషకులకు కూడా షాకిచ్చింది. ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలకు దాదాపు రెట్టింపు సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ స్వంతంగా 100కు పైగా సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ 2014లో కేవలం 44, 2019లో 52 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.

Lok sabha Election Result 2024: ఎన్డీయేకు ధీటుగా ఇండియా కూటమి.. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు తప్పుతాయా?
India alliance

కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుని విశ్లేషకులకు కూడా షాకిచ్చింది. ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలకు దాదాపు రెట్టింపు సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ స్వంతంగా 100కు పైగా సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ 2014లో కేవలం 44, 2019లో 52 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో 100కు పైగా లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్ వశమవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


ప్రస్తుతానికి కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి 224 స్థానాల్లో అధిక్యంలో ఉంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 291 స్థానాల్లో ముందంజలో ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 38 స్థానాల్లో ఎన్డీయే, 41 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యాల్లో కొనసాగుతున్నారు.


ఇండియా కూటమి 150 లోపే సీట్లు సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఆ సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి మెరుగైన ఫలితాలు సాధించే దిశగా దూసుకెళ్తోంది. మరోవైపు ఉత్తరాదిన పలు పెద్ద రాష్ట్రాల్లో ఎన్డీయేకు సీట్లు తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి చాలా మంది రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచే విధంగా అంచనాలకు మించి రాణిస్తోంది.

Updated Date - Jun 04 , 2024 | 11:04 AM