Home » Election Commission
ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, సీసీ కెమెరా ఫుటేజీల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు రాష్ట్ర అసెంబ్లీ తమకు గెజిట్ పంపించిందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఆ గెజిట్ తాము యథాతథంగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని సీఈవో సుదర్శన్‌రెడ్డి అన్నారు.
పోలింగ్ జరుగుతున్న తీరును మరింత నిశితంగా పరిశీలించడానికి నూరు శాతం వెబ్‌కాస్టింగ్ విధానాన్ని అమలు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
పోలింగ్ రోజున ఓటర్లు తమ ఫోన్లను పోలింగ్ స్టేషన్ దాకా తీసుకువెళ్లడానికి ఎన్నికల సంఘం(ఈసీ) వెసులుబాటు కల్పించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చివరి రెండు గంటల్లో అనైతిక ఓటింగ్ జరిగిందన్న రాహుల్ ఆరోపణలు నిరాధారమని ఈసీ వర్గాలు తేల్చిచెప్పాయి. ఓటింగ్ గణాంకాల ప్రకారం చివరి రెండు గంటల్లో ఓటింగ్ శాతం తగ్గిందని స్పష్టం చేశాయి.
కేంద్ర ఎన్నికల కమిషన్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల సరళిని ఉదహరించిన ఆయన ఈసీలో ఏదో భారీ లోపం ఉందని అన్నారు.
అన్నాడీఎంకే పార్టీ చిహ్నామైన రెండాకుల గుర్తు విషయంలో ఏర్పడ్డ విభేదాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా అన్నాడీఎంకే పార్టీ మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్దామి, పన్నీర్ సెల్వంలను 28ంతేదీన విచారణకు రావాలని ఆదేశించింది.
ఓటర్ల గుర్తింపు సక్రమంగా జరిగేలా ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్, మొబైల్ నంబర్లతో లింక్ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీఐ) అధికారులను ఆదేశించింది.
ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియ బలోపేతంపై సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది.
ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి తగిన చర్యలు తీసుకుంది. కృష్ణా - గుంటూరు, ఉభయ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది.