Home » Election Commission of India
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ త్రోసిపుచ్చింది. పోలింగ్ సందర్భంలోని సీసీ టీవీ ఫుటేజ్ బహిరంగ పర్చాలన్న డిమాండ్ సరైందికాదని అభిప్రాయపడింది. ఓటర్ల గోప్యత, వారి భద్రతా సమస్యలకు..
కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకున్న వారితో పాటు, పాత వాటిల్లో వివరాలు మార్చుకున్న వారికి కూడా దీనిని అమలు చేయాలని నిర్ణయించింది.
చట్టప్రకారం ప్రతి ఏడాది ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతుందని, ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు జాబితాను అందజేస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చెప్పారు.
ఎన్నికల కమిషన్‌పై ఎంపీ రాహుల్ గాంధీ శనివారం నాడు విమర్శలు ఎక్కుపెట్టారు. తీవ్రమైన ఆరోపణలకు ఈసీ జవాబులు దాటవేస్తోందని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్-ఫిక్సింగ్ జరిగిందని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇది పునరావృతం కావచ్చని పేర్కొన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కీలక డేటాను బహిరంగం చేయాలని ఈసీని రాహుల్ కోరారు. తీవ్రమైన అంశాలపై ఎగవేత ధోరణిలో ఈసీ స్పందించిందని విమర్శించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నియామకం కోసం ప్యానల్ రిగ్గింగ్‌తో ప్రారంభించి అవకతవకల సాక్ష్యాలను దాచిపెట్టడంతో ఐదంచెల్లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యూహాన్ని బీజేపీ మహరాష్ట్రలో అనుసరించిందని అన్నారు.
గుజరాత్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు, కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్‌లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా స్టార్లు కూడా కొత్తగా పార్టీ పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. దేశంలో వారానికో కొత్త పార్టీ పుట్టుకు వస్తోంది. ప్రతీ వీధిలో ఓ పార్టీ వెలుస్తోంది.
ఆధార్ కార్డుకు ఓటర్ ఐడీని అనుసంధానం చేసే దిశంగా సీఈసీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓటరు ఐడీల్లో అవకతవకలు జరుగుతన్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
భారత్‌లో ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసేందుకు అమెరికా నిధులు అందాయన్న వార్తపై ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ స్పందించారు. చరిత్రలో యూఎస్ఏఐడీ అతిపెద్ద కుంభకోణమని అన్నారు.