Home » Election Campaign
ఐదేళ్లకాలం నుంచి గ్రామాల్లో అభివృద్ధి చేయక ప్రకృతి సంపదను దోచేసిన వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లే కాలం దగ్గరపడిందని టీ డీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత విమర్శించారు. ఆమె గురువారం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథితో కలిసి మండల పరిధిలోని బొక్సంపల్లి, శ్యాపురం, కం బా లపల్లి, బీదానిపల్లి, కనుమర, నారనాగేపల్లి, నాగిరె డ్డిపల్లి, రాచూరు, జక్కలచెరువు, కుర్లపల్లి, కందుకూర్ల పల్లి, చిన్నకోడిపల్లిల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ కళ్యాణదుర్గంలోని ఇసుకను దోచుకుని పెనుకొండకు వచ్చిన మంత్రి ఉషశ్రీ చరణ్ వద్ద అక్రమంగా సంపాదించిన డబ్బుంటే తమవద్ద ప్రజాబలం ఉందన్నారు.
ప్రజలకు అండగా ఉంటా... అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని, ఎన్నికల్లో సైకిల్‌గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కూటమి తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పుప్పాల, నగరూరు, వేములపాడు, చందన, రాయలచెరువు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు.
తవ్విన కాలువలకు తూములెత్తి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అని ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ విమర్శించారు. మండలంలోని కోనాపురం, చిన్నముష్టూరు, లత్తవరం, లత్తవరం తండా, షేక్షానుపల్లి, రాచర్ల, రాచర్ల తండా గ్రామాలలో గురువారం కేశవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీకి ఓటేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని గుమ్మనూరు జయరాం ఓటర్లను కోరారు. పట్టణంలోని 29, 30 వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ఓఓటర్లకు కరపత్రాలను అందజేశారు. రాషా్ట్రభివృద్ధికి, యువతకు ఉద్యోగావకాశాలకు, రాజధాని నిర్మాణం, ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడి అవసరం ఉందన్నారు.
తనను గెలిపిస్తే... మీ పాలేరుగా పనిచేస్తానని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. గురువారం బ్రహ్మసముద్రం గ్రామంలో జనసేన ఇనఛార్జ్ మంజునాథ్‌గౌడ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రోజురోజుకు అమిలినేని సురేంద్ర బాబుకు ఆదరణ పెరుగుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు సాగుతున్నాయి. 250 వైసీపీ కుటుంబాలు గురువారం టీడీపీలోకి చేరారు. వీరందరికీ అమిలినేని సురేంద్రబాబు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కళ్యాణదుర్గం మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన పది వైసీపీ కుటుంబాలు, మున్సిపల్ పరిధిలోని రాచప్పకుంట, మారెంపల్లి, ఎన్టీఆర్ కాలనీలకు చెందిన 60 కుటుంబాలు, చాపిరిలో 22, మున్సిపాలిటీలని ఎన్టీఆర్ కాలనీకి చెందిన 23 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి.
ఏపీలో మే-13న సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) జరుగుండటంతో ఎన్నికల సంఘం (Election Commission) పలు నిబంధనలను విధించిన విషయం తెలిసిందే. అయితే.. అధికార వైసీపీ మాత్రం ఆ నియమాలను పాటించకుండా తుంగలో తొక్కుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
ఏపీలో పోలింగ్‌కు సమయం సమీపిస్తోంది. సరిగ్గా ప్రచారం ముగియడానికి పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇప్పటినుంచి మరో ఎత్తు అన్నట్లు ఉండనున్నాయి రాజకీయ పార్టీల వ్యూహ.. ప్రతి వ్యూహాలు. గెలుపు కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పదిరోజుల్లో ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాన రాజకీయపార్టీలు శ్రమిస్తున్నాయి.
వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడుదామని, చంద్రబాబును ముఖ్యమం త్రిని చేసుకుని మంచి పాలన పొందుదామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు పిలుపునిచ్చారు. ఆయన బుధవారం టీడీపీ నియోజకవర్గం సమన్వయ కర్త గుం డుమల తిప్పేస్వామితో కలిసి పట్టణంలోని శివాపురం, మారుతీనగర్, చిల్లెచిక్కనబండ, నాగన్నకుంట, వడ్రపా ళ్యం తదితర కాలనీల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధి కారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామన్నా రు.
దౌర్జన్యాలకు మారుపేరుగా నిలిచిన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను తిరస్కరించి, ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం పిలుపునిచ్చారు. పట్టణంలోని 18, 19, 20 వార్డు ఇనచార్జిలు తలారి సరోజమ్మ, అంజలీ దేవి, పవన కుమార్ గౌడు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జయరాం ప్రచారం నిర్వహించారు.