KALAVA CAMPAIN: రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం
ABN , Publish Date - May 01 , 2024 | 11:57 PM
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం మండలంలోని కెంచానపల్లి, జుంజురంపల్లి, బీఎనహళ్లి, బొమ్మక్కపల్లి, మల్లాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు.
కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు
రాయదుర్గంరూరల్, మే 1: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం మండలంలోని కెంచానపల్లి, జుంజురంపల్లి, బీఎనహళ్లి, బొమ్మక్కపల్లి, మల్లాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. పెద్ద ఎత్తున జనం తరలివచ్చి కాలవకు స్వాగతం పలికారు. ఆయన మల్లాపురం గ్రామంలో ఇటీవల కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాదాన్యత ఇవ్వడంతో మోదీ, చంద్రబాబు, పవనకళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తామన్నారు.
65 వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరిక
మల్లాపురం, బొమ్మక్కపల్లి గ్రామాలకు చెందిన 65 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. బుధవారం మల్లాపురం గ్రామంలో మాజీ సర్పంచ చిదానంద , వార్డు మెంబర్ ఎర్రిస్వామి, ఆనంద్‌రెడ్డి, జనార్ధనరెడ్డి, తిప్పారెడ్డితో పాటు 40 కుటుంబాలు టీడీపీలో చేరాయి. బొమ్మక్కపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, ప్రకాష్, పాలయ్య, వార్డు మెంబరు చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మరో 25 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి పార్టీ కండువా వేసి కాలవ శ్రీనివాసులు సాదరంగా ఆహ్వానించారు.
టీడీపీలో 39 కుటుంబాలు చేరిక
రాయదుర్గం: నేసేపేటకు చెందిన 39 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. నేసేపేటకు చెందిన చాకలి ప్రసాద్ ఆధ్వర్యంలో రాజు, జమీల్, ధనుంజయ, ముస్తాక్, మన్సూరు, అనిల్, ఎంగన్న, భరత, జిలానలతో పాటు పలువురు యువ కులతో పాటు అనేక మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
చంద్రబాబును గెలిపించండి రాషా్ట్రన్ని కాపాడండి
బొమ్మనహాళ్: సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబును గెలిపించండి రాషా్ట్రన్ని కాపాడుకోండి అని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బండూరు, దేవగిరి గ్రామాలలో టీడీపీ నాయకులు కేశవరెడ్డి, బలరాంరెడ్డి, కొత్తపల్లి మల్లికార్జున, కుమ్మరి మల్లికార్జున, అప్పారావు, ముల్లంగి నారాయణస్వామి, మహేంద్ర, పయ్యావుల అనిల్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కుటుంబసభ్యుల ప్రచారం
టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు తనయుడు కాలవ భరత గుమ్మఘట్ట మండలం కలుగోడు గ్రామంలో ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తన తండ్రిని గెలిపించాలని కోరారు. అదే విధంగా కాలవ శ్రీనివాసులు కూతురు కాలవ గౌతమి కణేకల్లు మండలంలో యర్రగుంట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.
తెలుగువారు తరలివచ్చి టీడీపీని గెలిపించండి
బళ్లారి (ఆంధ్రజ్యోతి): ఏపీ భవిష్యత కోసం తెలుగువారు ఏ రాష్ట్రం, ఏ దేశంలో ఉన్నా, తరలివచ్చి టీడీపీని గెలిపించాలని రాయదుర్గం కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి బళ్ళారిలో ఉన్న తెలుగు వారితో ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. బళ్ళారి జిల్లా కమ్మ సంఘం అధ్యక్షుడు ముండ్లూరు అనూప్ కుమార్ కాలవను సన్మానించారు. కాలవ మాట్లాడుతూ ఏపీ ప్రశాంతంగా ఉండాలన్నా, అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అందుకు కర్ణాటక, ఇతర రాషా్ట్రల్లో తెలుగు వారందరూ వచ్చి ఓటు వేయాలన్నారు. కమ్మ సంఘం అధ్యక్షలు అనూప్ కుమార్, రాయదుర్గం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మెన చంద్రహాస్, కొత్తపల్లి తిమ్మరాజులు, హనుమంత రెడ్డి, బొమ్మనహాల్ మోహన దాస్ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....