Share News

SAVITA: ఫ్యానకు ఓటేస్తే ఉరేసుకోవాల్సిందే..

ABN , Publish Date - May 02 , 2024 | 12:03 AM

ఒక్క చాన్సపేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన ప్రభుత్వం అవినీతి, అరాచకాలకు ఒడిగట్టిందని... మళ్లీ వైసీపీకి ఓటేస్తే జనం ఫ్యానకు ఉరివేసుకోవాల్సిందేనని టీడపీ కూటమి ఎమ్మెల్యే అ భ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె బుధవారం రొద్దం మండల పరిధిలోని సానిపల్లి, గొబ్బరంపల్లి, బొమ్మిరెడ్డి పల్లి, నల్లూరు, చోళేమర్రి, కల్లుకుంట, చిన్నమంతూరు, దందేపల్లి, పీ కొత్తపల్లి, పెద్దమంతూరు, చెరుకూరు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ ఐదేళ్లకాలంలో వైసీపీ ప్రభుత్వం అనేకమంది టీడీపీ నాయకులు, కార్య కర్తలపై అక్రమ కేసులు బనాయించిందన్నారు.

SAVITA: ఫ్యానకు ఓటేస్తే ఉరేసుకోవాల్సిందే..
Savitha participated in the Sanipalli roadshow

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత

రొద్దం, మే 1 : ఒక్క చాన్సపేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన ప్రభుత్వం అవినీతి, అరాచకాలకు ఒడిగట్టిందని... మళ్లీ వైసీపీకి ఓటేస్తే జనం ఫ్యానకు ఉరివేసుకోవాల్సిందేనని టీడపీ కూటమి ఎమ్మెల్యే అ భ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె బుధవారం రొద్దం మండల పరిధిలోని సానిపల్లి, గొబ్బరంపల్లి, బొమ్మిరెడ్డి పల్లి, నల్లూరు, చోళేమర్రి, కల్లుకుంట, చిన్నమంతూరు, దందేపల్లి, పీ కొత్తపల్లి, పెద్దమంతూరు, చెరుకూరు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ ఐదేళ్లకాలంలో వైసీపీ ప్రభుత్వం అనేకమంది టీడీపీ నాయకులు, కార్య కర్తలపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. ఇసుక, మద్యం, మట్టి, గనుల నుంచి వేల కోట్ల సంపదను వైసీపీ నాయకులు కొల్లగొట్టారన్నారు.


గత టీడీపీ పాల నలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే గ్రామాల్లో కని పిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో కియ అనుబంధ పరిశ్రమలు తీసుకొచ్చి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు పార్లమెంట్‌ అభ్యర్థి బీకే పార్థసారథికి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీవీపీనాయుడు, మాధవనాయుడు, మాజీ జడ్పీటీసీ సుబ్బరత్నమ్మ, చంద్రమౌళి, నరహరి, హరీష్‌, శ్రీనాథ్‌చౌదరి, క్లస్టర్‌ ఇనచార్జ్‌నాగేంద్ర, సానిపల్లి సూరీ, వెంకటేశ, గొబ్బరంపల్లి రవి, చోళేమర్రి సర్పంచ జనార్దన, ఎమ్మార్పీఎస్‌ నాగరాజు, చిన్నమం తూరు వెంకటేశ, పవన, నరసింహులు, టైలర్‌ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.


యువతను ముంచినసీఎం

పెనుకొండ టౌన: యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించకపోవడమే కాకుండా, చాలామం దిని గంజాయికి బానిసలు చేసిన వ్యక్తి సీఎం జగన అని టీడీపీ కూటమి ఎమ్మెల్యేఅ భ్యర్థి సవిత ఆరో పించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ మ్యేనిఫెస్టోపై మాట్లాడారు. అన్నివర్గాలకు న్యాయం చే సేలా చంద్రబాబు, కూటమి నేతలు మేనిఫెస్టోను రూ పొందించారని అదే వైసీపీ మేనిఫెస్టో రైతులతో పాటు సామాన్యులను నట్టేట ముంచేలా ఉందన్నారు. అలాగే మేడేను పురస్కరించుకుని సవిత లారీ డ్రైవర్‌ అసోసి యేషనతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న ఆ అసోసియేషన కార్యాలయం వద్ద బుధవారం జెండా ఆవిష్కరించారు. టీడీపీ ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 02 , 2024 | 12:03 AM