Share News

GUMMANURU: వైసీపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించండి

ABN , Publish Date - May 02 , 2024 | 12:03 AM

దౌర్జన్యాలకు మారుపేరుగా నిలిచిన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను తిరస్కరించి, ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం పిలుపునిచ్చారు. పట్టణంలోని 18, 19, 20 వార్డు ఇనచార్జిలు తలారి సరోజమ్మ, అంజలీ దేవి, పవన కుమార్‌ గౌడు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జయరాం ప్రచారం నిర్వహించారు.

GUMMANURU: వైసీపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించండి
18వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న గుమ్మనూరు జయరాం

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం

గుంతకల్లు, మే 1: దౌర్జన్యాలకు మారుపేరుగా నిలిచిన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను తిరస్కరించి, ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం పిలుపునిచ్చారు. పట్టణంలోని 18, 19, 20 వార్డు ఇనచార్జిలు తలారి సరోజమ్మ, అంజలీ దేవి, పవన కుమార్‌ గౌడు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జయరాం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందజేసి ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో అన్ని వర్గాలవారికి మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. తనకు, ఎంపీ అభ్యర్థి అంబికాకు ఓటువేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు ఆర్‌ శ్రీనాథ్‌గౌడు, పట్టణాధ్యక్షుడు బండారు ఆనంద్‌, టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బీఎస్‌ కృష్ణారెడ్డి, నాయకులు తలారి మస్తానప్ప, అనిల్‌ కుమార్‌ గౌడు, హేమాద్రి, లక్ష్మీదేవి, టీ శివ, జనసేన, బీజేపీ నాయకులు, ఎన్బీకే, పవన అభిమానులు పాల్గొన్నారు. జయరాం సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు మండలంలోని ఎన తిమ్మాపురం గ్రామంలో ప్రచారం చేశారు. కార్యక్రమంలో గుమ్మనూరు వెంకటేశులు, కేసీ రామాంజనేయుయులు, తదితరులు పాల్గొన్నారు. ముష్టూరు తిమ్మప్ప ఆధ్వర్యంలో ఎంపీ అంబికా తరపున రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ కార్యాలయంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండు ఓట్లూ టీడీపీకి వెయ్యాలని ఉద్యోగ సంఘ నాయకులను అభ్యర్థించారు.


ముస్లిం మైనార్టీల సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

పట్టణంలో గురువారం నిర్వహించనున్న ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి నియోజకవర్గంలోని ముస్లిములందరూ హాజరై జయప్రదం చేయాలని గుమ్మనూరు జయరాం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. తిలక్‌నగర్‌లోని మహేంద్ర కళ్యాణ మండపంలో గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. శాసన మండలి మాజీ చైర్మన షరీఫ్‌ మహమ్మద్‌ అహ్మద్‌, రాష్ట్ర మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ హాజరౌతున్నారన్నారు.


గుత్తి: పట్టణంలోని 23వ వార్డులో టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ ఎమ్మెల్యే అభ్యర్థి జయరాం తరపున ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు జయరాం, అంబికా లక్ష్మినారాయణకు ఓటువేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పామిడి: మండలంలోని పీ కొత్తపల్లి గ్రామంలో గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్‌ ప్రచారం నిర్వహించారు. తన తండ్రి జయరాంకు, ఎంపీ అభ్యర్థి అంబికాకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని గ్రామీణ ఓటర్లను కోరారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 02 , 2024 | 12:03 AM