Home » Education
జేఎన్టీయూలో కీలకమైన పరీక్షల విభాగాన్ని సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఇటీవల పరీక్షల విభాగంలో కొందరు అధికారులను, సిబ్బందిని బదిలీ చేసిన ఉన్నతాధికారులు వారి స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో కొన్ని సెక్షన్లలో సేవలు స్తంభించాయి.
విద్యా హక్కు చట్టాన్ని కొన్ని ప్రైవేటు పాఠశాలలు అపహాస్యం చేస్తున్నాయి. పేద విద్యార్థులకు సీట్లు ఎందుకివ్వాలని అడ్డం తిరుగుతున్నాయి.
జేఎన్టీయూ పాలకమండలి సమావేశం వాయిదా పడింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై వర్సిటీలో అభివృద్ధి పనులు, విద్యార్థులు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై చర్చించాల్సి ఉంది.
యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.
Google Careers for Graduates: ప్రపంచ టెక్ దిగ్గడం గూగుల్‌లో ఉద్యోగం సంపాదించడం యువతకు ఒక కల. అయితే, కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవారికి మాత్రమే ఈ సంస్థలో ఉద్యోగం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ, ఇదొక అపోహ మాత్రమే. నాన్-టెక్నికల్ విభాగంలో గ్రాడ్యుయేట్ అయినవారూ గూగుల్‌లో జాబ్ సంపాదించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్మీడియట్ విద్యాశాఖపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. పలు పోస్టులకు పదోన్నతుల విషయంలో ముడుపులు డిమాండ్ చేశారనే అంశం ఏసీబీ విచారణకు దారితీసింది. తాజాగా కమిషనరేట్‌లోని ఓ సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు విచారించారు.
DRDO JRF Recruitment 2025: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)లో కలలుగనే యువతకు మంచి అవకాశం. DRDO జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టులకు నియామకాలను ప్రకటించింది. స్టైపెండ్ నెలకు ఏకంగా రూ. 37,000. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు డీఆర్డీవో అధికారిక వెబ్ సైట్ drdo.gov.in ని సందర్శించి వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం..
జేఎన్టీయూ(JNTU)లో డిప్యూటీ డైరెక్టర్ పదవులను రద్దు చేస్తూ వర్సిటీ ఉపకులపతి కిషన్‌కుమార్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్ల కిందట వర్సిటీలోని పలు విభాగాలకు అప్పటి వీసీ కట్టా నర్సింహారెడ్డి డిప్యూటీ డైరెక్టర్ పోస్టులను సృష్టించగా, ఆ నిర్ణయాలకు ప్రస్తుత వీసీ తాజాగా మంగళం పాడారు.
పోస్టు గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్ , ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన పీజీఈసెట్-2025 ఫలితాలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
విద్యార్థులు సవాళ్లను స్వీకరించాలని, లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.