Home » Education News
జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పడి 60 వసంతాలు పూర్తయిన సందర్భంగా నవంబరు 21, 22 తేదీల్లో వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ టి.కిషన్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల డైమండ్ జూబ్లీ లోగోను ఆవిష్కరించారు.
జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ సీట్ల సంఖ్యను పెంచే అంశం వైస్‌చాన్స్‌లర్ కిషన్‌కుమార్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తోందా అంటే.. విద్యార్థి సంఘాల నుంచి అవుననే జవాబు వినిపిస్తోంది. 213 సీట్ల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీచేయగా, విద్యార్థి సంఘాల వినతి మేరకు సీట్ల పెంపు ప్రతిపాదనపై వైస్‌చాన్స్‌లర్ సమాలోచనలు చేశారు.
ఎట్టకేలకు జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ ప్రవేశాలకు మోక్షం లభించింది. సెప్టెంబరులో నిర్వహించిన ప్రవేశపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు నెలరోజులుగా అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అర్హులైన అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనకు తాజాగా అడ్మిషన్ల విభాగం అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.
జేఎన్‌టీయూకు అనుబంధంగా ఉన్న మూడు ఇంజనీరింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో పాటు పలువురు ఆచార్యులను బదిలీ చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం
పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్)లో అర్హత సాధించిన అభ్యర్థులను ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్(టీసీ) కష్టాలు వెంటాడుతున్నాయి.
ఉన్నత విద్యాసంస్థల్లో అకడమిక్, రీసెర్చ్ కెరీర్ ఆశించే పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈసారి 8 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటారని ఎన్‌టీఏ అంచనా వేస్తోంది. అభ్యర్థులు కచ్చితమైన విద్యార్హతల వివరాలు సమర్పించాలని, ఎలాంటి పొరపాట్లు జరిగినా దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.
విద్యార్థుల జీవితంలో పదో తరగతి సర్టిఫికెట్ కీలక పాత్ర పోషిస్తుంది. చాలా సందర్భాల్లో పుట్టిన తేదీకి పదో తరగతి సర్టిఫికెట్‌నే ప్రామాణికంగా తీసుకుంటారు. అలాంటి సర్టిఫికెట్‌లోనే తప్పులు ముద్రితమైతే ఏం చేయాలి. పదో తరగతి సర్టిఫికెట్‌లో తప్పులుంటే మార్చుకునే వీలుంది.
టీచింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (EMRS) భారీ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న EMRS స్కూళ్లలో 7,267 ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీ చేయనున్నారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరులో సీటు రాక చదువుకు దూరమైన విద్యార్థిని మీనుగ జెస్సీ పొలం పనులు చేస్తోంది. విద్యార్థిని మీనుగ జెస్సీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
గ్రూప్-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దని ర్యాంకర్ల తల్లిదండ్రులు పేర్కొన్నారు. పలు పార్టీ నేతల రాజకీయాల కోసం తమ పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దని సూచించారు.