Home » Duddilla Sridhar Babu
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఒక్క అంగుళం కూడా తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. శాసనసభలో మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ లేవనెత్తిన అంశంపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారిశ్రామిక, ఐటీ రంగంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని ఆ శాఖ మంత్రి దుద్దిశ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలనే జేఏసీ విజ్ఞప్తిని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. తెలంగాణ రైజింగ్‌లో మహిళలకు అవకాశం ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
న్యాయవాదులు, గుమాస్తాల సంక్షేమ బిల్లులను శాసనసభ శుక్రవారం ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, బార్ కౌన్సిల్ ప్రతిపాదన మేరకు ఈ బిల్లులను రూపొందించామని, ప్రస్తుతం ఒక్కో కేసుకు రూ.100 టికెట్ వసూలు చేస్తున్నారని, దానిని రూ.250కి పెంచుతున్నామని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మహేశ్వరం మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన సోమవారం పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందు ఉంచుతామని, శాసన సభ ప్రాంగణంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
రాష్ట్ర అసెంబ్లీ, ముఖ్యమంత్రిని కించపరిచేలా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో అభివృద్ధి బదలాయింపు హక్కులు(టీడీఆర్) అంశంలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ఆరోపణలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్రంగా స్పందించారు. బట్ట కాల్చి మీద వెయ్యడం కాదనీ, కేటీఆర్ వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.
కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.