Home » Deputy CM Pawan Kalyan
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం విజయ్‌తో పోల్చి తనను వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
రక్షణ, ఏరోస్పేస్, డీప్ టెక్నాలజీ రంగాలలో ఆంధ్రప్రదేశ్ ఒక శక్తి కేంద్రంగా మారే ప్రయాణంలో ఏఎంసీఏ ప్రాజెక్టు కీలకమైన మైలురాయి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభివర్ణించారు.
జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వార్డులు, డివిజన్ల పునర్విభజన అంశంపై కీలక సమావేశం నిర్వహించింది.
అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ఏపీ మంత్రులు పొదుపు చర్యలను పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తరహాలోనే మంత్రులు కాన్వాయ్‌ని కుదించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో 580కి పైగా మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించేందుకు చర్యలు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంటూ ఏలూరు జిల్లాలోని పెదపాడు పాఠశాలకు కొత్త భవనం నిర్మించారు. ‘అడవితల్లి బాట’ కార్యక్రమ ప్రారంభోత్సవ సమయంలో ఇచ్చిన మాట మేరకు పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ క్రమశిక్షణ, అంకితభావం రాజకీయాల కంటే సేవకే అగ్ర ప్రాధాన్యం ఇస్తారని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కుప్పుస్వామి వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయడానికి పవన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ స్వాగతం పలకడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించింది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2025, నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్–2025 అవార్డుల్లో దేశవ్యాప్తంగా ఏపీ రెండో స్థానం సాధించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసాలకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు.