Home » Deputy CM Pavan Kalyan
శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదని.. అది ఒక బాధ్యతాయుతమైన పౌరుడితో మొదలవుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రపంచ పారిశుధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్(X) వేదికగా డిప్యూటీ సీఎం పవన్ పోస్టు పెట్టారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఎక్స్‌లో... ‘గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి భారత ప్రధాని వరకు మోదీ 25 ఏళ్లుగా నిరంతరాయంగా ప్రజాసేవ చేస్తున్నారు. మోదీ విప్లవాత్మక నాయకత్వం వల్ల దేశం అభివృద్ధి పథంలో కొత్త వేగం పుంజుకుంది.
మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో చరిత్రాత్మక విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
విఘ్నాలను తొలగించి, శుభాలను ప్రసాదించే పర్వదినం వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోవాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం వేర్వేరు ప్రకటనల్లో వారు ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేరళం రాష్ట్రం త్రిస్సూర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీ బాలకృష్ణుని దర్శించుకున్నారు. భుజం గాయంతో బాధపడుతున్న పవన్‌కు ఆయుర్వేద థెరపీ చేసిన వైద్యులు కూడా ఆయనతోపాటు బాలకృష్ణస్వామిని దర్శించుకున్నారు.
ఒక ‘సాప్ట్వేర్’ గ్రామీణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చింది. గ్రామ పంచాయతీల జవాబుదారీతనం పెంచడంతోపాటు, ఆదాయాన్ని ఏకంగా రెట్టింపు చేసింది. అదే.. ‘స్వర్ణ పంచాయతీ పోర్టల్.’ ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ రూపొందించిన సరికొత్త పోర్టల్ ఇది!. గ్రామీణ ప్రాంతాల్లో పన్ను ఎగవేతదారులకు ఈ పోర్టల్ సింహస్వప్నంగా మారింది.
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల నేపధ్యంలో జిల్లా యంత్రాంగం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ సూచనలు చేశారు.
హస్తకళాకారుల అభివృద్ధికి కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. క్లస్టర్ల వారీగా కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.
పేపర్‌మిల్లు నుంచి పెనాల్టీలు, పన్నులు ఎలా వసూలో చేయాలో సంబంధిత మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బాగా తెలుసునని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.