Home » Delhi liquor scam
లిక్కర్ కేసులో సీబీఐ వాదనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితది కీలకపాత్ర అని సీబీఐ చెబుతోంది. సౌత్ గ్రూప్‌నకు చెందిన వ్యాపారవేత్త సీఎం కేజ్రీవాల్‌ను కలిశారని తెలిపింది. లిక్కర్ బిజినెస్‌కు సహకరిస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారన్నారు. లిక్కర్ వ్యాపారులను సీఎం కేజ్రివాల్‌కు కవిత కలిపారని సీబీఐ తరుఫు లాయర్ కోర్టుకు తెలిపారు.
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై.. తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసింది. శుక్రవారం మరోసారి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనుంది. ఢిల్లీ మద్యం కేసులో కవితను గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది.
సీబీఐ అరెస్టు కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha ) కు మరోసారి చుక్కెదురైంది. కవితను సీబీఐ అరెస్టు చేయడాన్ని నిరాకరిస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. సీబీఐ అరెస్టుపై అత్యవసరంగా సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి మనోజ్ కుమార్ బెంచ్ ముందు అప్లికేషన్ ఫైల్ దాఖలు చేశారు.
Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు(Kejriwal) సుప్రీంకోర్టులో(Supreme Court) తక్షణ ఊరట లభించలేదు. తన అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్‌ను వచ్చే సోమవారం పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్..
దేశ రాజధాని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోరుతూ పదే పదే పిటిషన్లు దాఖలు అవుతుండటంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది.
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. తాను కోరిన ఓ విజ్ఞప్తిని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బుధవారం కొట్టివేసింది.
తనకు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైన నేపథ్యంలో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అక్రమంగా అరెస్ట్ చేసిందని, తనకు వెంటనే ఉపశమనం కల్పించాలని కోరారు.
Delhi Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత(K Kavitha) మరోసారి స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న విధంగా తనకు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదన్నారు. లిక్కర్ కేసులో(Liquor Scam) తాను బాధితురాలినని, రెండేళ్ల నుంచి కేసు విచారణ ఎటూ తేలడం లేదన్నారు. ఈ మేరకు మంగళవారం నాడు..
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. జైలులో ఉంటూ సమర్థవంతమైన పాలన అందించలేరంటూ తక్షణమే పదవి నుంచి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు.