Home » Delhi Excise Policy
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ఓడించి తెలంగాణ వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలలో జరిగిన విజయసంకల్ప సభలో మోదీ మాట్లాడారు. తెలంగాణలో బీజేపీకి రోజురోజుకి ఆదరణ పెరుగుతోందన్నారు. మే13న తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని.. వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలన్నారు.
MLC Kavitha ED Custody: అవును.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) కాస్త రిలీఫ్ దక్కింది.! వారం రోజుల పాటు కవితను ఈడీ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే..
Kavitha Custody Report: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) వరుస షాక్‌లు తగులుతున్నాయి. 7 రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఈడీ ఇక రంగంలోకి దిగనుంది. కవిత కస్టడీకి సంబంధించి సంచలన విషయాలను ఈడీ రిలీజ్ చేసింది.
ED Notices To Kavitha Husband: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.! శుక్రవారం నాడు సోదాలు అని చెప్పి ఈడీ, ఐటీ రంగంలోకి దిగడం.. సడన్‌గా అరెస్ట్ చేయడం.. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఈడీ (ED) కస్టడీకి ఇవ్వడం.. ఈ వరుస షాకులతో సతమతమవుతున్న కవితకు మరో ట్విస్ట్ ఇచ్చింది ఈడీ..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor scam case) సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) ఎట్టకేలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కాగా కేజ్రీవాల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల వ్యక్తిగత బాండ్, రూ.1 లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారాయి. అయితే ఈడీ అధికారులు తనను అరెస్టు చేస్తారని, తన అరెస్టు తప్పదని గతంలోనే కవిత చెప్పారు.
దిల్లీ మద్యం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఉదయం నుంచి సుదీర్ఘ సోదాల అనంతరం ఈడీ అధికారులు కవితను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు.
దిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( kavitha ) ను ఈడీ అరెస్టు చేసింది. కవిత అరెస్టుతో రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి.
లిక్కర్ పాలసీలో విచారణకు సంబంధించి ఆఫ్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల మధ్య దోబూచులాట కంటిన్యూ అవుతూనే ఉంది. విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీచేస్తూనే ఉంది. అసెంబ్లీ అని ఉందని, వ్యక్తిగత కారణాలు చూపుతూ కేజ్రీవాల్ మినహాయింపు కోరుతున్నారు. తాజాగా మరోసారి ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.