Share News

Arvind Kejriwal: రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..

ABN , Publish Date - Mar 16 , 2024 | 10:19 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor scam case) సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) ఎట్టకేలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కాగా కేజ్రీవాల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల వ్యక్తిగత బాండ్, రూ.1 లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు.

Arvind Kejriwal: రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..

ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor scam case) సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) ఎట్టకేలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కాగా కేజ్రీవాల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల వ్యక్తిగత బాండ్, రూ.1 లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు.

కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో దర్యాప్తునకు సహకరించాలని అధికారులు పలుమార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో ఈడీ అధికారులు కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు రెండుసార్లు సమన్లు జారీ చేసింది. తనకు జారీ చేసిన నోటిసులను రద్దు చేయాలని కోర్టును కేజ్రీవాల్ కోరారు. అయితే కేజ్రీవాల్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. కోర్టు తన విజ్ఞప్తిని పరిశీలించకపోవడంతో కోర్టు కేజ్రీవాల్ హాజరయ్యారు. కాగా మద్యం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారం కింద సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ 8 సార్లు నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించినప్పటికీ కోర్ట్ బెయిల్ ఇచ్చింది.

కొనసాగుతున్న వాదనలు

దీంతో న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు. కేజ్రీవాల్‌పై మోపిన అభియోగాలు బెయిల్ పొందటానికి అవకాశం ఉన్న సెక్షన్లు అని న్యాయమూర్తి పేర్కొన్నారు. తదుపరి వాదనలు కొనసాగించాలని ఈడీ, కేజ్రీవాల్ తరపు న్యాయవాదులకు న్యాయమూర్తి నాగపాల్ చెప్పారు. దీంతో కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.

Updated Date - Mar 16 , 2024 | 11:27 AM