Home » Cyber Crime
ఆ 19 ఏళ్ల కుర్రాడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు.. ఇబ్బందుల్లో ఉన్న స్నేహితుడికి సహాయం చేయాలనుకున్నాడు.. ఫ్రెండ్ అడిగిన వెంటనే తన బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపించాడు.. చివరకు రూ.7 కోట్ల స్కామ్‌లో చిక్కుకున్నాడు.. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.
రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి నగర పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఇతర సామాజిక కంటెంట్ క్రియేటర్స్‌తో జతకట్టి సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి సిద్ధమయ్యారు.
సైబర్ నేరగాళ్లు పండుగలను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రంజాన్ మాసం ప్రారంభమైన తరుణంలో సామాజిక మాధ్యమాల్లో డొనేషన్, రంజాన్ ఆఫర్ల సందేశాల పేరుతో వల విసురుతున్నారు.
బెంగళూరుకు చెందిన ఓ నటికి దారుణమైన అనుభవం ఎదురైంది. కొందరు దుర్మార్గులు ఆమె ప్రైవేట్ వీడియో తీసి, బెదిరింపులకు దిగారు. వారి వేధింపులు భరించలేకపోయిన నటి బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది..
ఓ ట్రేడింగ్ సంస్థ నుంచి క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేస్తామని నమ్మించిన కొందరు సైబర్ నేరగాళ్లు.. నకిలీ కేవైసీ పేరుతో ఆ సంస్థ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి సుమారు రూ. 21.80 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు.
వాలెంటైన్స్‌డే సందర్భంగా ప్రేమికులను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ క్రిమినల్స్ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారని, యువత అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అమలాపురానికి చెందిన ఓ పీఎంపీ వైద్యుడు ఆన్‌లైన్ మోసగాళ్ల వలలో పడి మోసపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మహబూబాబాద్‌లో షాకింగ్ సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. బయ్యారం మండలంలో పలువురు పంచాయతీ కార్యదర్శుల పాస్‌వర్డ్‌లు చోరీకి గురయ్యాయి.
ఓ ఘరానా సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్టు చేశారు. వృద్ధుడిని భయపెట్టి రూ.1.7కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాడు ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు. నగరంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ తరహ నేరాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ప్రతిరోజు ఎవరె ఒకరు బలవుతూనే ఉన్నారు.
ముషీరాబాద్‌కు చెందిన దక్షిణ మధ్య రైల్వే ఇంజినీర్‌ను ఓ యువతి పెళ్లి పేరుతో నమ్మించింది. అనంతరం క్రిప్టో ట్రేడింగ్‌లో లాభాల పేరుతో పెద్ద మొత్తంలో ఊడ్చేసింది. బాధితుడు సుమారు రూ.54 లక్షలు నష్టపోయాడు. ఈ మోసంపై వెంటనే బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.