Home » Cyber Crime
రోజురోజుకీ పెరుగుతున్న సైబర్ దోపిడీలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా 'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0' పేరిట ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది.
నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ‘Purple Crayon00’ ద్వారా తనపై దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నట్టు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
డేటింగ్ యాప్ పేరుతో పరిచయమై 51 ఏళ్ల వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాధితుడి వద్ద నుంచి దాదాపు రూ.25 లక్షలు కాజేశారు కేటుగాళ్లు.
ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.94.36 లక్షలు కాజేశారు. కొత్తపేటకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి (70)ని సైబర్ నేరగాళ్లు సంప్రదించారు.
దేశవ్యాప్తంగా ఇటీవల డిజిటల్ అరెస్ట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కొత్త తరహా మోసం ప్రజలను మరింత ఆందోళనను కలిగిస్తోంది. తాజాగా ఓ రిటైర్డ్ జడ్జిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.
సైబర్ నేరగాళ్లు పెట్టుబడుల పేరిట వృద్ధుడిని మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు కేవలం డబ్బునే కాకుండా, వ్యక్తిత్వాన్ని దొంగిలిస్తున్నారని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బయోమెట్రిక్‌తో మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ వి.అరవింద్‌బాబు హెచ్చరించారు.
ఆ 19 ఏళ్ల కుర్రాడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు.. ఇబ్బందుల్లో ఉన్న స్నేహితుడికి సహాయం చేయాలనుకున్నాడు.. ఫ్రెండ్ అడిగిన వెంటనే తన బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపించాడు.. చివరకు రూ.7 కోట్ల స్కామ్‌లో చిక్కుకున్నాడు.. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.
రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి నగర పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఇతర సామాజిక కంటెంట్ క్రియేటర్స్‌తో జతకట్టి సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి సిద్ధమయ్యారు.
సైబర్ నేరగాళ్లు పండుగలను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రంజాన్ మాసం ప్రారంభమైన తరుణంలో సామాజిక మాధ్యమాల్లో డొనేషన్, రంజాన్ ఆఫర్ల సందేశాల పేరుతో వల విసురుతున్నారు.