Home » Cyber attack
యూకేలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగిని బురిడీ కొట్టించి రూ.3.7 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు(City Cyber Crime Police) ఫిర్యాదు చేశాడు.
మనీ లాండరింగ్ కేసుల పేరుతో ఓ వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు(Cyber criminals) భయపెట్టి రూ.10.90 లక్షలు కాజేశారు. ఓ వ్యక్తి(75) ప్రైవేట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. సైబర్ నేరగాళ్లు అతడికి ఫోన్‌చేసి ముంబైలోని అంధేరి పోలీస్‌స్టేషన్(Andheri Police Station) నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు.
ఇంటర్నెట్ వినియోగం లేనిదే సమయం గడవని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు తమ అవసరాల కోసం ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ పైనే ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇదే నేరాలకు దారి చూపిస్తోంది. సెర్చ్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతున్న సైబర్ నేరగాళ్లు.. ఎవరు ఎలాంటి అంశాల కోసం వెతుకుతున్నారో గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ తెలుసుకొని దానికి అనుగుణంగా నకిలీ వెబ్‌సైట్‌లను, అప్లికేషన్‌లను, మొబైల్ యాప్‌లను రూపొందిస్తున్నారు.
పిల్లలు లేని మహిళలను గర్భవతులను చేయండి. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోండి. ఇదే ఆలిండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ స్కెచ్. సోషల్ మీడియాలో ఈ పేరిట ప్రకటనలు చేస్తూ కొత్త తరహా మోసాలకు తెరలేపింది బీహార్ గ్యాంగ్..
దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతూ.. వందలాది మందిని మోసం చేసి రూ. కోట్లు కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్(Cyber criminals) ఆటకట్టించారు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు.
ఆన్‌లైన్ షాపింగ్(Online shopping) చేసినందుకు గాను.. మీరు ఖరీదైన బహుమతి గెలుచుకున్నారంటూ.. విద్యార్థినిని బురిడీ కొట్టించి రూ. 1.30లక్షలు సైబర్ క్రిమినల్స్(Cyber criminals) కొల్లగొట్టారు.
ఐటీ కంపెనీలో ఉద్యోగం ఇస్తామని, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఇన్వెస్టిమెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించిన క్రిమినల్స్ మహిళను బురిడీ కొట్టించి రూ. 11.92 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన 37 ఏళ్ల మహిళకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
ఓ యువతికి స్నాప్ చాట్ ద్వారా పరిచయమైన యువకుడు స్నేహితులతో ముఠాగా ఏర్పడి పథకం ప్రకారం రూ. 48.38లక్షలు కొల్లగొట్టాడు. రంగంలోకి దిగిన ప్రత్యేక టీమ్ హైదరాబాద్(Hyderabad)కు చెందిన ముగ్గురు సైబర్ నేరగాళ్లను కటకటాల్లోకి నెట్టారు.
ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగిని నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ.12.59లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆన్‌లైన్‌లో డ్రెస్ ఆర్డర్ చేసిన మహిళను సైబర్ నేరగాళ్లు(Cyber criminals) మోసం చేసి ఆమె ఖాతా నుంచి రూ. 1.38 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన 59 ఏళ్ల మహిళకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన కనిపించింది.