Home » CPI
బీఆర్‌ఎ్‌సతో కలిసి పనిచేసే ఆలోచన సీపీఐకి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని, బీఆర్‌ఎస్ తప్పుడు విధానాల వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టిందన్నారు.
వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, మత సంస్థలపై బీజేపీ పెత్తనం కోసం తెచ్చిందని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. మైనారిటీల మనోభావాలను దెబ్బతీసేలా బీజేపీ, జనసేన వ్యాఖ్యలున్నాయని అన్నారు
కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే, తాము శాంతి చర్చలకు సిద్ధమేనని సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రకటించడంపై శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా పంచాయతీ కార్మికుల సమస్యలు, ఇతర అంశాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.
మనిషి కి మరణం ఉంటుంది కానీ కమ్యూనిజానికి మరణం ఉండదు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ శత వసంతాల ఉత్సవాలను ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
భూముల అమ్మకం ద్వారా రూ.పదివేల కోట్లు సేకరించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
భారీ రుణభారం, సంక్ష్లిష్ట ఆర్థిక పరిస్థితుల మధ్య ప్రభుత్వం సాహాసోపేతమైన బడ్జెట్ ప్రవేశ పెట్టిందని.. తీపి, చేదు కలగలుపు ఉగాది పచ్చడిలా 2025-26 బడ్జెట్ ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.
ఎమ్మెల్యే కోటా పరిధిలోని ఐదు ఎమ్మెల్సీ సీట్లకు కాంగ్రెస్ తరఫున ముగ్గురు, సీపీఐ, బీఆర్‌ఎస్ తరపున ఒక్కొక్కరు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి ఐదు సీట్లకుగాను నాలుగింటిలో పోటీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్.. అందులో ఒకటి మిత్రపక్షం సీపీఐకి కేటాయించిన సంగతి తెలిసిందే.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీ (యాదవ) సామాజిక వర్గానికి చెందిన నేత.. నెల్లికంటి సత్యం పేరును సీపీఐ ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.
పేదలకు ఎన్నికల ముందు ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ రాప్తాడు నియోజకవర్గం ఆధ్వర్యంలో అనంతపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద వందలాదిమంది మహిళలు, నాయకులు ధర్నాచేశారు.