CPI: కుల గణన ఎప్పుడు పూర్తి చేస్తారు?: డి.రాజా
ABN , Publish Date - May 04 , 2025 | 04:44 AM
కుల గణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో కేంద్రం స్పష్టం చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా డిమాండ్ చేశారు. విధాన పరమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారనే దానిపై సమాధానం చెప్పాలన్నారు.

న్యూఢిల్లీ, మే 3 (ఆంధ్రజ్యోతి): కుల గణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో కేంద్రం స్పష్టం చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా డిమాండ్ చేశారు. విధాన పరమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారనే దానిపై సమాధానం చెప్పాలన్నారు. కుల గణనను నాలుగేళ్లుగా పెండింగ్‌లో పెట్టారని గుర్తు చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు రామకృష్ణతో కలిసి ఆయన మీడియాతో శనివారం మాట్లాడారు.
కుల గణన చేయాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలోనూ కుల గణనకు మద్దతు తెలిపామని, అన్నివిధాలా సహకరించామని స్పష్టం చేశారు. రిజర్వేషన్ ఫలాలు అర్హులందరికీ అందాలంటే జన గణనలో కుల గణన అవసరమని అన్నారు. రిజర్వేషన్లకు 50 శాతం పరిమితిని కేంద్రం తొలగించాలని చెప్పారు.