Home » Congress
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నేడు కేటీఆర్ ఆయనతో భేటీ కానున్నారని తెలుస్తోంది.
కేరళంలో 140 సీట్లు ఉండగా.. గత ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 99 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 41 స్థానాల్లో గెలిచింది.
కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో సీఎంలుగా పనిచేసిన కరుణాకరన్, ఊమెన్ చాందీలు కేరళంను ఎంతగానో అభివృద్ధి చేశారని ప్రస్తావించారు.
తెలంగాణలో కేసీఆర్‌ను మార్చినట్లే, కేరళంలో కూడా పినరయి విజయన్‌ను ప్రజలు మార్చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పినరయికి మోదీనే గాడ్‌ఫాదర్ అని, అన్ని కేసుల్లో కాపాడుతున్నారని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో ‘కుక్కర్’ పార్టీ ఉండదని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం తెలిపారు. కారైక్కుడి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సోమవారం పలు ప్రాంతాల్లో కార్తీ చిదంబరం ప్రచారం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని ప్రజలను కోరారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ భార్య మూడు విదేశీ పాస్‌పోర్టులు కలిగి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు తీవ్ర ఆరోపణలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టంచాయి. అయితే ఈ ఆరోపణలను హిమంత బిశ్వా శర్మ తోసిపుచ్చారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన ఆ మూడు మున్సిపాలిటీల్లో రెండింటి లెక్క తేలింది. క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మొత్తం 27 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు విడుదల చేసింది. డీఎంకే కూటమిలో భాగంగా కాంగ్రెస్ మరోసారి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.