Home » Congress Govt
స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రైతులను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు.
వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని బీజేపీ శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. పంటల కొనుగోళ్లు చేయకపోవడంతో ప్రతిరోజూ రైతులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్‌పైన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తప్పు చేస్తే తన కుమారుడిని శిక్షించాలంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను అభినందిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. తన చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం బండి సంజయ్‌కు వచ్చిందన్నారు.
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు వ్యవహారంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు.
తెలంగాణలో నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలబట్టడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం తప్పనిసరి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ హక్కుల కోసం తాము కేంద్రంతో పోరాడుతామని వ్యాఖ్యానించారు.
జై శ్రీ రామ్ అంటే పై నుంచి పైసలు పడతాయా అని మంత్రి కొండా సురేఖ ఎలా అంటారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. . ఎండోమెంట్ మంత్రి అంటే దేవుడికి మినిస్టర్‌లాగా ఉండాలని.. కానీ కొండా సురేఖ ఏశాఖకు మంత్రి..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
రైతులందరూ ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రసాయనాల వాడకాన్ని తగ్గించకపోతే వ్యవసాయమే ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి రైతుబంధు బంద్ పెట్టి.. రాహుల్‌గాంధీకి కప్పం కడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కనపడితే రైతుబంధు ఇంకా ఎప్పుడు ఇస్తారని కాలర్ పట్టుకుని నిలదీయాలని హెచ్చరించారు.