Home » Congress Govt
బీసీ రిజర్వేషన్‌లో కీలకమైన జీవోనెం.9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేషన్‌కు సంబంధించి హైకోర్టులో నిన్నటి నుంచి కొనసాగుతన్న వాదనలు ఇవాళ్టీతో ముగిసాయి.
బీసీల నోటికాడ ముద్దను ఆపారని ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తొందరపాటు చర్యలతో అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ స్పందన చూశాక బంద్‌కు పిలుపునిస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలిందని హైకోర్టుకు ఏజీ సుదర్శన్‌రెడ్డి వివరించారు. సర్వే డేటా ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేల పాత ఉద్యోగాలు ఇచ్చి తాము ఇచ్చినట్లు అబద్ధపు ప్రచారం చేస్తుందని కవిత ఆరోపించారు. ప్రొఫెసర్ హరగోపాల్‌ని స్వయంగా కలుస్తానని ఆమె స్పష్టం చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం కొనసాగిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ తనను అలా అనడం బాధ కలిగించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు తన సామాజిక వర్గాన్ని కించపరిచాయని వాపోయారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణులతో ఈ రోజు(మంగళవారం) జూమ్ మీటింగ్ నిర్వహించారు.
పొన్నం వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్ లాగా అహంకారంగా మాట్లాడటం తనకురాదని తెలిపారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రెహమత్ నగర్‌లో ముగ్గురు మంత్రులు.. పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. దీన్ని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి చర్యగా భావించిన ఎన్నికల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది.