Home » Congress 6 Gurantees
పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్(Congress) కేడర్‌కు ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి(Deepa Dasmunshi) కీలక సూచనలు చేశారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ప్రచార కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ప్రచార కార్యక్రమాలు పోలింగ్ బూత్ లెవెల్ వరకు తీసుకెళ్లాలని తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే సత్తా కాంగ్రెస్(Congress)కు లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల తర్వాత మరింత బలహీనపడే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు.
పదేళ్లు ప్రధానిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) దేశానికి ఏం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ఎలాంటి కృషి చేయలేదని అన్నారు. బుల్లెట్ ట్రైన్‌ను గుజరాత్‌కు తీసుకెళ్లిన మోదీ, వికారాబాద్‌కు ఎంఎంటీఎస్ రైలును కూడా తీసుకురాలేదని మండిపడ్డారు.
ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ ఎత్తుగడేనని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. సోమవారం నాడు జహీరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి పునాదులపై నిర్మించిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే కుప్పకూలుతోందన్నారు.
కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చాక 180మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిన్న(ఆదివారం) తాను దేవరుప్పుల మండలం లక్ష్మి భాయి తండాకు వెళ్లానని.. అక్కడ ఉన్న రైతుల కళ్లలో కన్నీళ్లను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు.
బీఆర్ఎస్(BRS) నుంచి వేరే పార్టీలోకి వెళ్లేవారిని వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి*(Palla Rajeshwar Reddy) హెచ్చరించారు. పార్టీ మారే నేతలు పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని చెప్పారు. పార్టీ మారిన నేతలని ప్రజలు చెప్పులతో కొడతారని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)కి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంపీ అభ్యర్థులు లేక తమ పార్టీ నేతల వెంట పడుతున్నారని మండిపడ్డారు. కొందరు పిరికి పందలు పార్టీ మారుతున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ మంత్రులకు రైతుల గోడు వినే సమయం లేదని.. అక్రమంగా మామూళ్లు వసులు చేయడంలో వారు అరితేరారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) అన్నారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో కరువు ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. నల్గొండ జిల్లాలోనే పెద్ద సంఖ్యలో వ్యవసాయ భూములు సాగు నీరు అందక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లో ఓల్టేజ్ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోయి రైతులకు వేల రూపాయల నష్టం కలగచేస్తున్నాయని చెప్పారు.
మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అయిందని మాజీమంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) అన్నారు. గురువారం నాడు రేఖ్యా తండా, దుబ్బ తండాలలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.
తాము ఇంకా గేట్లు తెరవలేదని.. తెరిస్తే బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీల్లో నేతలు ఎవరూ ఉండరని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ (Congress) లోకి రమ్మని తాము ఎవరిని అడగటం లేదని.. స్వచ్ఛందంగా నేతలే తమ పార్టీలో చేరుతామని వస్తున్నారని వివరించారు. గురువారం నాడు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
పెండింగ్‌లో ఉన్నా కృష్ణా రివర్ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తిచేయాలని మాజీ మంత్రి డీకే సరమసింహారెడ్డి (Samarasimha REDDY) కోరారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కృష్ణనది నుంచి తెలంగాణకు దక్కాల్సిన వాట దక్కడం లేదని చెప్పారు. 800 టీఎంసీలలో మనకు 64 శాతం వాట రావాల్సి ఉందన్నారు.