Home » children
ట్రాక్టర్ రోటవేటర్‌తో తండ్రి దుక్కి దున్నుతుండగా.. సరదాగా ట్రాక్టర్ ఇంజన్ పైకి ఎక్కిన కుమారుడు ప్రమాదవశాత్తు రోటవేటర్లో పడి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లైన్‌తండాలో సోమవారం జరిగింది. లైన్‌తండాకు చెందిన గుగులోతు మశోద, రాజులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
వీధి కుక్కలు మరో పసి బాల్యాన్ని చిదిమేశాయి. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు రెండు రోజులకొకటి జరుగుతున్నా కొంత మంది తల్లిదండ్రులు జాగ్రత్త వహించక తమ పసి మొగ్గలను ఒంటరిగా వదులుతూ వారి నిండు ప్రాణాలను వీధి కుక్కలకు బలి చేస్తున్నారు.
శెట్టూరు మండలం ఐదుకల్లుకు చెందిన ముగ్గురు చిన్నారుల సంరక్షణ బాధ్యతలను ఐసీడీఎస్ అధికారులు తీసుకున్నారు. గ్రామానికి చెందిన చంద్రకళ, తిమ్మరాజు దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. తిమ్మరాజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చంద్రకళ ఇటీవల మరణించారు. దీంతో చిన్నారులు అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, ఇతర అధికారులు గురువారం గ్రామానికి వెళ్లారు. ఆరో తరగతి చదువుతున్న ప్రభాని(11), రెండో తరగతి ..
తెలుగు రాష్ట్రాల్లో పిల్లలను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విక్రయిస్తున్న ముఠా అరెస్టు సంచలనంగా మారింది. 13మంది చిన్నారులను కాపాడి 11మంది నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.
గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్‌లో శనివారం చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 35కు పెరిగింది. వీరిలో 12 మంది చిన్నారులున్నారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ప్రమాదంలో..
దేశ రాజధాని ఢిల్లీ శనివారం అర్ధరాత్రి రెండు వేర్వేరు అగ్నిప్రమాదాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో ఏడుగురు చిన్నారులు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి 25మందిని కాపాడారు.
అక్కడికి సరదాగా కాసేపు ఆడుకునేందుకు వచ్చిన పిల్లలు గానీ.. వారు ఆడుకుంటుంటే చూస్తూ ముచ్చట పడుతున్న తల్లిదండ్రులు గానీ కాసేపట్లో చుట్టుముట్టే మంటల్లో చిక్కుకొని సజీవదహనం అవుతామని ఊహించలేకపోయారు! కంప్యూటర్ గేమ్స్‌లో కొందరు.. జారుడు బల్లాటలో ఇంకొందరు.. ఆడుతూనే అనంత లోకాలకు చేరారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణ పట్ల శీతకన్ను వేసింది. ఐదేళ్ల పాలనా కాలంలో రెండేళ్లు మాత్రమే ఈ శిబిరాలు నిర్వహించింది. అందులోనూ క్రీడాకారులకు ఎటువంటి కిట్లు ఇవ్వకుండా, కోచలకు గౌరవ వేతనం చెల్లించకుండా మమా అనిపించేసింది. ఈ ఏడాదిలో మే 1 నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తామని కోచల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తరువాత సార్వత్రిక ఎన్నికలు అంటూ మే 15కి వాయిదా వేశారు. తిరిగి ఈ ఏడాది రెగ్యులర్‌గా శాప్ కోచలు నిర్వహించే శిక్షణ కేంద్రాలనే సమ్మర్...
హైదరాబాద్: కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద అంబర్ పెట్ మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్లో నాలుగు సంవత్సరాల చిన్నారి రిషిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిని గమనించిన స్థానికులు కుక్కలను వెంబడించడంతో చిన్నారికి ప్రాణ పాయం తప్పింది.
జిల్లాలో రికార్డుస్థాయిలో ఎండలు నమోదువుతున్నాయి. బయట అడుగు పెట్టాలంటే జనం బెంబేలెత్తుతున్నారు. మే నెలలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది అత్యధికంగా పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. రానున్న రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని రేకులకుంట ఆచార్య ఎన్జీరంగా వ్యవసార పరిశోధన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త గుత్తా నారాయణస్వామి హెచ్చరించారు. వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మే నెలలో గత 20 ...