Home » Chief Minister
ముఖ్యమంత్రి రేఖాగుప్తా గత ఫిబ్రవరిలో పదవీ బాధ్యతలు చేపట్టారు. జూన్‌లో ఆమెకు రాజ్ నివాస్ మార్గ్‌లోని బంగ్లా నెంబర్ 1 కేటాయించారు. మరో బంగ్లా (బంగ్లా నెంబర్ 2) కూడా ఆమెకు కేటాయించారు. అయితే అది క్యాంప్ ఆఫీసుగా ఉపయోగపడనుంది.
తమను ఒకచోట చేర్చడం ఎవరికీ సాధ్యం కాలేదని, బాల్ ఠాక్రే సైతం చేయలేకపోయిన పనిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా చేశారని రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది.
ముఖ్యమంత్రి షెడ్యూల్ ప్రకారం రత్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి శుక్రవారంనాడు బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక 19 ఎస్‌యూవీలతో కూడిన కాన్వాయ్‌లో సమస్యలు తలెత్తాయి. వాహనాలు జర్క్‌లు ఇస్తూ నిలిచిపోయాయి.
రాష్ట్ర హోదా అనేది ఎమ్మెల్యేకో, ప్రభుత్వానికో చెందినది కాదని, జమ్మూకశ్మీర్ ప్రజలకు సంబంధించిన అంశమని, ఇందుకు తమ ఎమ్మెల్యేలు అడ్డుకాదని ఒమర్ అబ్దుల్లా చెప్పారు.
సింధు జలాల ఒప్పందం కింద పాకిస్థాన్‌కు ఉద్దేశించిన జలాలను పంజాబ్, రాజస్థాన్, హర్యానాకు మళ్లించాలని కేంద్రం నిర్ణయించినట్టు పలు మీడియాలో ఇటీవల కథనాలు వచ్చాయి. ఈ నిర్ణయాన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేసేందుకు జలశక్తి మంత్రి ఇప్పటికే దృష్టి సారించారని చెబుతున్నారు.
జమ్మూకాశ్మీర్‌లో అన్ని రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రితో తాను పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఒమర్ అబ్దుల్లా అన్నారు. మొదట అనంతనాగ్ రైల్వే స్టేషన్ ప్రారంభం కాగా, రెండవసారి బనిహాల్ రైల్వే టన్నెల్ ప్రారంభంలో పాల్గొన్నానని తెలిపారు.
చినాబ్ బ్రిడ్జి వంతెన ప్రారంభోత్సవానికి రాజకీయ ప్రాధాన్యత ఉందని ఒమర్ అబ్దుల్లా పేర్కొంటూ, ఇందుకు గత నాయకులు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. త్వరలోనే జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కశ్మీర్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రంగంపై పహల్గాం ఉగ్రదాడి ప్రభావం తీవ్రంగా పడిందని, ఈ నేపథ్యంలో పర్యాటకంపై ఆధారపడిన ప్రజలకు సంఘీభావంగా క్యాబినెట్ సమావేశాన్ని పహల్గాంలో ఏర్పాటు చేశామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
ఊలర్ సరస్సుపై గతంలో తలపెట్టిన 'తుల్‌బుల్' నేవిగేషన్ ప్రాజెక్టును పునరుద్ధరించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఉంది. అయితే, ఒమర్ అబ్దుల్లా అభిప్రాయంతో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విభేదించారు.
అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటారని, అప్పుడు యావద్దేశం సాయుధ బలగాలకు అండగా నిలుస్తుందని ఢిల్లీ సీఎం రేఖాగుప్తా అన్నారు.