Home » Canada
యువత గుండెలు ఎందుకంత బలహీనంగా మారుతున్నాయి. రెండు పదుల వయసులోనే గుండెలపై అంత భారం ఎందుకు పడుతోంది. యువతకు తరచూ గుండె పోటు రావడానికి కారణాలేంటి.. ఇవన్నీ మేధావీ లోకాన్ని, శాస్త్రవేత్తలను తొలిచేస్తున్న ప్రశ్నలు. తాజాగా భారత్‌కు చెందిన ఓ విద్యార్థి కెనడా(Canada)లో హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు.
భారత్‌పై కారాలు మిరియాలు నూరుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆ దేశంలో ఎన్నికలు జరగనుండగా... భారత్‌తో కెనడాకు "విదేశీ ముప్పు"(Foreign Threat) ఏర్పడుతోందనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు.
అమెరికాలో(America) సంక్రాంతి వేడుకలను(Sankranthi Celebrations) అక్కడి తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కెనడా, నోవా స్కోటియా, హాలిఫాక్స్, డార్ట్ మౌత్, బెడ్ ఫోర్డ్ తదితర ప్రాంతాల్లో ఎన్ఆర్ఐ(NRIs)లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా ముగ్గులు, గాలిపటాలు, పూల తోరణాలతో ఆయా ప్రాంతాలు రంగులమయం అయ్యాయి.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ వివాదం ఇంకా కొనసాగుతున్న తరుణంలో.. కెనడాకు చెందిన ఒక ఉన్నాతాధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణలో కెనడాతో భారత్ సహకరిస్తోందని తెలిపారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి టొరంటో బ్రాంటెన్‌లోని చింగ్కూజీ సెకండరీ స్కూల్‌లో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో 800కు పైగా ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ వేడుకల్ని కమిటీ కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి ప్రారంభించారు.
కెనడాలో ఇళ్లకు కొరత నేపథ్యంలో విదేశీ విద్యార్థుల రాకపై పరిమితులు విధించాలని ట్రూడో ప్రభుత్వం యోచిస్తోంది. వలసలు, శరణార్థులు, పౌరసత్వ శాఖల మంత్రి మార్క్ మిల్లర్ తాజాగా ఒక టీవీచానల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో విదేశీ విద్యార్థుల సంఖ్య 9లక్షలకు చేరడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కెనడా దేశానికి వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఆ దేశానికి వెళ్లే విద్యార్థుల సంఖ్యపై పరిమితిని విధించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒట్టావా ఎయిర్ కెనడా విమానంలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కెనడా నుంచి దుబాయ్ వైపు టేకాఫ్ అవ్వబోతుండగా ఓ వ్యక్తి క్యాబిన్ డోర్ తెరిచి బయటకు దూకాడు. అయితే తర్వాత ఏమైందనే విషయాలు ఇప్పుడు చుద్దాం.
కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ సత్వీందర్ సింగ్ అలియాస్ సతిందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పై కేంద్రం ఉక్కుపాదం మోపింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967 కింద గోల్డీ బ్రార్‌ను టెర్రరిస్టుగా ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో తెలియజేసింది.
కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్(బీకేఐ) డైరెక్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూఏపీఏ చట్టం కింద లాండాను హోంశాఖ ఉగ్రవాదిగా పేర్కొంది.