Share News

Canada: తాకా ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణం

ABN , Publish Date - Apr 21 , 2024 | 09:22 PM

తాకా తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 శనివారం నాడు టొరొంటోలో శ్రీరామనవమి శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగాయి.

Canada: తాకా ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణం

ఇంటర్నెట్ డెస్క్: తాకా (TACA – Telugu Alliances of Canada) తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 శనివారం నాడు టొరొంటోలోని శ్రీ శృంగేరీ విద్యా ఫీఠం దేవస్థానం ఆడిటోరియంలో దాదాపు పన్నెండు వందల మంది ప్రవాస తెలుగువారు (NRI) సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని శ్రీరామనవమి శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కళ్యాణ ఉత్సవాలను ప్రముఖ పురోహితులు మంజునాథ్ ఆధ్వర్యంలో పది మంది వేద పండితులు, పురోహితులు శాస్త్రొక్తంగా జరిపించారు.

1.jpgNRI: సౌదీ అరేబియాలో కన్నులపండువగా శ్రీ రామ నవమి వేడుకలు


సాక్షాత్తు శ్రీరాముల వారు తానిషా ప్రభువుకు కనిపించి శ్రీరామదాసును చెరసాల నుండి విడిపించేందుకు కప్పంగా కట్టిన అలనాటి మాడలకు సరైన వెండి నాణేలు, దేవస్థానం వారి లడ్డూలు భద్రాచలం నుండి తెప్పించి కళ్యాణం చేయించుకున్న భక్తులకి తాంబూలంతో పాటు ఇవ్వడం ప్రత్యేకంగా నిలవగా, హాజరైన వారందరూ తాకా కమిటీ సభ్యులను అభినందించారు.

3.jpg


ఈ కళ్యానోత్సవంలో అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల, ఉపాధ్యక్షులు రాఘవ్ అల్లం, జనరల్ సెక్రెటరి ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి, కోషాధికారి మల్లిఖార్జునా చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ, డైరక్టర్లు కుమారి విద్య భవణం, ఖజిల్ మొహమ్మద్, దుర్గా ఆదిత్యవర్మ భూపతిరాజు, యూత్ డైరక్టర్ లిఖిత యార్లగడ్డ, ఎక్స్ అఫీషియో సభ్యురాలు శ్రీమరి కల్పన మోటూరి, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ అరుణ్ కుమార్ లాయం, ట్రస్టీ బోర్డు చైర్మన్ సురేశ్ కూన, ట్రస్టీలు శృతి ఏలూరి, వాణి జయంతి, పవన్ బాసని, ఫౌండర్లు హనుమంతాచారి సామంతపుడి, శ్రీనాథ్ కుందూరి, మునాఫ్ అబ్దుల్ గారలు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2024 | 09:22 PM