Share News

NRI: సౌదీ అరేబియాలో కన్నులపండువగా శ్రీ రామ నవమి వేడుకలు

ABN , Publish Date - Apr 21 , 2024 | 05:52 PM

సువిశాల సౌదీ అరేబియాలో తెలుగు ప్రవాసీయులు శ్రీరామ నవమి వేడుకలను వైభవోపేతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

NRI: సౌదీ అరేబియాలో కన్నులపండువగా శ్రీ రామ నవమి వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సువిశాల సౌదీ అరేబియాలో తెలుగు ప్రవాసీయులు (NRI) శ్రీరామ నవమి వేడుకలను వైభవోపేతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రియాధ్, జెద్ధా నగరాలలో వేద మంత్రోచ్చారణల మధ్య కన్నులపండువగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేక ఆపార్టుమెంట్లు, ఇస్త్రాహాలలో బంధుమిత్రులు రాములోరి వేడుకను నిర్వహించగా తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా నేతృత్వంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన కార్యక్రమంలో అనేక మంది కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

NRI: లండన్‌లో వైభవంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

రియాధ్‌లో..

సనాతన ఆగమ శాస్త్ర ప్రకారం సాంప్రదాయ పద్ధతిలో సాగిన ఈ తంతును భక్తులు తన్మయత్వంతో చూసి తరించారు. వేడుకను చూసేందుకు రియాధ్ నగర నలుమూలల నుంచి అనేక డజన్ల భక్తులు వచ్చారు. భక్తి శ్రద్ధలతో సీతాసమేతుడైన శ్రీరామచంద్రుణ్ణి, ఉత్సవ మూర్తులను వేదికపై తీసుకురాగా భక్తులు ఆనందంతో పరవశించిపోయారు. ముంబాయి వాస్తవ్యురాలయినప్పటికీ నిండు తెలుగుతనం ఉట్టిపడే శ్రీదేవి రావు మంత్ర, వేదోచ్చారణతో కార్యక్రమం మొదలయింది. అంతకు ముందు సాటా అధ్యక్షుడు జి.ఆనందరాజు, మహిళ విభాగం అధ్యక్షురాలు సుచరితలు స్వాగతోపన్యాసం చేసారు.

సాటా మహిళా సభ్యురాళ్ళు చేతన, గీత, నీలిమ, అక్షిత, మాధవి, ప్రియాంక, శిల్పా, భారతి, కవిత, సుచురిత, సుధ, లావణ్యలు కలిసికట్టుగా శ్రీసీతారాములను అలంకరించారు. దినమంతా జరిగిన కార్యక్రమంలో తెలుగు సంప్రదాయ రీతిలో పవన్, ఆనందరాజు, సత్తిబాబులు అరటి ఆకులపై వడ్డించిన భోజనాలు భద్రాచలం సమీపంలో పర్ణశాలను గుర్తుకు తెచ్చాయి.

r2.jpg

శ్రీ రామ నవమితో పాటు తెలుగు నూతన సంవత్సరం శ్రీ క్రోధి నామ వేడుకలను కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా చిత్తూరు జిల్లాకు చెందిన రంజిత్ శ్రీ క్రోధి నామ సంవత్సర రాశీ ఫలాలు, స్థితిగతుల గురించి వివరించిన తీరు అందరిలో ఆసక్తి కల్గించింది. పంచాగం శ్రవణంలో తిథి, వార, నక్షత్ర యోగ, కరణ ఫలితాలను తెలుసుకోవాలని ఆయన హితువు పలికారు.

అటు శ్రీరామ నవమి, ఇటు ఉగాది కార్యక్రమాలకు తనదైన ముసిముసి నవ్వుల శైలీలో చేతన చేసిన వ్యాఖ్యాలు సన్నివేశాలకు సరిగ్గా సరిపోయాయి. కార్యక్రమ నిర్వహణను ముజ్జమీల్ షేఖ్, ఆనందరాజు, నరేంద్ర, వినయ్, సత్తిబాబు, ఆనంద పోకూరిలు సమన్వయం చేసారు.


జెద్ధాలో..

జెద్ధా నగరంలోనూ శ్రీ రామ నవమి వేడుకలను ఎన్నారైలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. భార్గవి, శివారెడ్డిల వేదపూజలతో ప్రారంభమైన ఈ వేడుకలకు వ్యాఖ్యాతగా అన్నపూర్ణ వ్యవహరించారు. రామాయణం, ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుని గురించి అన్నపూర్ణ చిన్నారులకు నిర్వహించిన క్విజ్ అందర్నీ ఆకట్టుకుంది. రామాయణం ప్రాధాన్యత గురించి డాక్టర్ అలోక్ తివారి, కవిత దంపతులు వివరించారు.

సాటా జెద్ధా అధ్యక్షుడు నరేశ్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో మల్లేశన్, నాగరాజు, లక్ష్మి, గణేశ్, నారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

j.jpgతబూక్ లో..

ఎడారి నాట పురోగమనం వైపు వికసిస్తున్న తబూక్‌లో కూడా సాటా ఆధ్వర్యంలో శ్రీరామ నవమి, ఉగాది ఉత్సవాలు జరిగాయి. రెడ్ సీ ప్రాజెక్టులో పని చేసే రాజమండ్రికి చెందిన మాధవరపు మూర్తి శ్రీ క్రోధి నామ సంవత్సర రాశీ ఫలాల గురించి వివరించారు. సన్నిధి రోహన్, హరి ప్రియా, రమీజ్ రజా, పరుశురాం, సతీశ్, అనూష, తిరుపతి లోకోటా, నాగరాజు, సూర్య, నరేష్‌లు కార్యక్రమాన్ని సమన్వయం చేసారు.

t.jpgమరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 21 , 2024 | 06:26 PM