Home » Bus Facility
మాదాపూర్, హైటెక్ సిటీ(Madapur, hi-tech city)లో పనిచేస్తున్న ఐటీ, ఇతర ఉద్యోగుల కోసం 127కె కోఠి-కొండాపూర్ రూట్‌లో కొత్తగా ఎలక్ర్టిక్ ఏసీ మెట్రో లగ్జరీ బస్సులను(Electric AC Metro Luxury Buses) సోమవారం నుంచి అందుబాటులోకి తేనున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.
ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణం పోయింది. మద్యం మత్తులో బస్సు నడపడంతో ఔటర్ రింగ్ రోడ్డుపై బోల్తా పడింది. ప్రైవేట్ ట్రావెల్స్ (మార్నింగ్ స్టార్) బస్సు ఆదివారం రాత్రి గచ్చిబౌలి నుంచి చెన్నైకు బయల్దేరింది.
ప్రమాదాల నివారణ కు....ప్రయాణికుల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అటు బస్సు డ్రైవర్లు...ఇటు ప్రయాణికులు సైతం పెడ చెవిన పెడుతున్నారు. నడి రోడ్డుపై బస్సు ఆపడం...నడి రోడ్డులో నిలబడిన బస్సును ఎక్కడం ప్రమాదమని తెలిసినా వారు అదే పనిచేస్తూ ప్రమాదాలను కొని తె చ్చుకుంటున్నారు. మండలంలోని కొడికొండ చెక్‌పోస్టు లో బస్టాండ్ లేదు.
మన్సూరాబాద్‌లోని కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ బస్సును పునఃప్రారంభించడం హర్షణీయమని కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. మన్సూరాబాద్(Mansurabad) డివిజన్‌లోని ప్రెస్ కాలనీ, సౌంత్ ఎండ్ పార్క్, సెవెన్ హిల్స్‌కాలనీ, డిపినగర్, చండీశ్వర్‌కాలనీలకు గతంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు కొనసాగాయి.
బడులు మళ్లీ తెరుచుకున్నాయి. కొత్త విద్యాసంవత్సరం.. కొత్త తరగతి.. కొత్త పుస్తకాలు, బ్యాగు, యూనిఫాంతో పిల్లలు హుషారుగా వెళుతున్నారు! కానీ బడికి వెళ్లి వచ్చేందుకు వారు ఎక్కుతోంది ఫిట్‌నెస్ లేని బస్సుల్లో! వారి ప్రయాణం సాగుతోంది ప్రమాదపుటంచుల్లో! బడులు తెరుచుకొని నాలుగురోజులైనా రాష్ట్రవ్యాప్తంగా 40శాతానికి పైగా ఫిటెనెస్ లేని బస్సులు రోడ్ల మీద తిరుగుతున్నాయి.
ఆర్టీసీ బస్సు దిగుతుండగా కాలు జారి దాని చక్రాల కింద పడి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని దుర్మరణం పాలైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం హైదరాబాద్‌లోని యూసు్‌ఫగూడ చెక్‌పోస్ట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉచిత బస్సు ప్రయాణం పథకం’ మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది కానీ.. బస్సు డ్రైవర్లకు మాత్రం లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది! టిక్కెట్టు లేని ప్రయాణం..
రొళ్ల-అగళి ప్రయాణించే ఆర్టీసీ బస్సు హొట్టేబెట్ట వద్ద హైవేపై శనివారం ఆగిపోయింది. తిరిగి స్టార్ట్ కాకుండా మొరాయించింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇక విధిలేని పరిస్థితుల్లో అది స్టార్ట్ అయ్యే వరకు దానిని తోయాల్సి వచ్చింది.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఎఫెక్ట్ రైల్వే, బస్సుల్లో ప్రయాణించే రెగ్యులర్ ప్యాసింజర్స్ పై కనిపిస్తోంది. మహాజాతరకు నగరం నుంచి సిటీ బస్సులను తరలించడంతో సిటీ ట్రావెలర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Free Bus: నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్టాండ్ దగ్గర శనివారం మధ్యాహ్నం ఓ యువకుడు వినూత్నంగా నిరసన చేపట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్టీసీ బస్సుల్లో తమకు సీట్లు దొరకడం లేదని.. మహిళల తరహాలో మగవాళ్లకు కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.