Home » Bharath
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకున్న కిరాతక చర్యలో పాక్ ప్రమేయానికి ఆధారాలను నిర్ధారించిన భారత్ ఇందుకు ప్రతిగా దశబ్దాల క్రితం నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. 1960లో అంతర్జాతీయ అభివృద్ధి పునర్మిర్మాణ బ్యాంకు అయిన ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ మధ్య కుదిరిన నీటి పంపిణీ ఒప్పందమే ఈ సింధు నదీ జలాల ఒప్పందం
పహల్గాం ఉగ్రదాడితో భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు సూచనలు వస్తున్నాయి.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడిన మష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశాయి. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రమూకల్లో కొందరూ ఇప్పటికి కశ్మీర్‌లోనే ఉండి ఉంటారని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా చీఫ్ ఆఫీజ్ సయ్యద్‌కు నాలుగు రెట్లు భద్రత కల్పించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతదేశం దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఫోన్ కాల్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.
ఉగ్రవాదం పోరులో భారత్‌కు అండగా ఉంటామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. భారత్,పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇరుదేశాల ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టే చర్యలకు సహకారం అందిస్తామన్నారు.
Pakistan Military Alert: భారతదేశం చర్యలకు ఉపక్రమిస్తే తిప్పికొట్టడానికి పాకిస్థాన్ ఆర్మీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్ సమీపంలోని సరిహద్దు ప్రాంతాలకు పాకిస్థాన్ సైన్యాన్ని మోహరిస్తోంది.
Minister TG Bharath: సాక్షి మీడియాపై మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై సాక్షి మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ విషయంలో సాక్షిపై కేసు వేస్తానని మంత్రి టీజీ భరత్ హెచ్చరించారు.
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మొదలైన తర్వాత భారత్ ప్రపంచ కర్మాగారంగా మారుతుందా. చైనాకు ప్రత్యామ్నాయంగా మారే అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకుంటుందా. అందుకోసం ఇండియా సిద్ధంగా ఉందా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ మైనారిటీ నేత భబేశ్ చంద్ర రాయ్‌ను ఇంట్లోంచి అపహరించి, దారుణంగా హత్య చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల్లో ఇది మరొకటిని భారత్ పేర్కొంది.