Home » Bharath
అణుయుద్ధాన్ని నివారించేందుకు వాణిజ్య బెదిరింపులు చేశానని ట్రంప్ వెల్లడించగా, భారత్ వర్గాలు ఆయన వ్యాఖ్యలు వాస్తవం కాదంటూ ఖండించాయి. అమెరికా వాణిజ్యంతో బెదిరించి భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ సాధించానని ట్రంప్ వ్యాఖ్యానించారు.
India- Pakistan War: పాకిస్తాన్, భారతదేశాల మధ్య సోమవారం నాడు కీలక చర్చలు జరుగనున్నాయి. ఈ చర్చల్లో పలు అంశాలను రెండు దేశాలు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఈ చర్చలు రెండు దేశాలకు ఎంతో ప్రాధాన్యం కానున్నాయి.
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. ఆపరేషన్ సిందూర్‌తో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, అమెరికా హస్తక్షేపంతో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి.
జమ్ముకశ్మీర్‌లో పోరాడుతూ అమరుడైన అగ్నివీర్ మురళీనాయక్ పార్థివదేహం స్వగ్రామం కళ్లితండాకు తరలించారు.మంత్రి సవిత, పవన్ కల్యాణ్, లోకేశ్ తదితరులు నేడు అధికార లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు హాజరుకానున్నారు.
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే పాకిస్థాన్ ఉల్లంఘించింది. డ్రోన్లతో దాడులు జరిపి బీఎస్‌ఎఫ్ ఎస్సై వీర మరణం చెందారు.
Operation Sindoor: పాకిస్థాన్ అటాక్‌లో జమ్మూకశ్మీర్‌లోని శంభు ఆలయం పాక్షికంగా దెబ్బతిన్నది. అలాగే నివాసాలు, ఆలయంపై పాక్ నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలను రక్షణ శాఖ సోషల్ మీడియాలో విడుదల చేసింది.
భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందోనని దేశ పౌరులు ఆందోళన చెందుతున్నారు. భారత బలగాలు పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెబుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ దుశ్చర్యలను తిప్పికొడుతున్నాయి.
భారతదేశం ప్రస్తుతం పాకిస్తాన్‌తో యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు ఆర్థిక సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ కోర్ బ్యాకింగ్ సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. పౌరులు, వ్యాపారాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ సేవల్లో అంతరాయం రాకూడదని అన్నారు.
Kishan Reddy: దేశ భద్రత కోసం పోరాటం చేస్తున్న భారత సైనికులకు మద్దతుగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక ర్యాలీలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ అమంచర్ల పార్కు భవిష్యత్ తరాలకు గుర్తుండేలా భారత్ సిందూర్ యంఎస్ఏంఈ పార్క్‌గా పేరు పెట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది తెలిపారు. యంఎస్ఎంఈ పార్కు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భవిష్యత్‌లో మరింత విస్తరిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది అన్నారు.