Home » Bengaluru News
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలు, నగర పాలికెసంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ పద్దతిలోనే నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. గురువారం సాయంత్రం విధానసౌధలో మంత్రివర్గ సమావేశం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన జరిగింది.
బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఈనెల 5, 6 తేదీలలో జరిగే అంతర్జాతీయ మిలాద్-ఉన్-నబి సమ్మేళనంలో విదేశీ ధర్మగురువులు భారత్‌లో ధార్మిక కార్యక్రమాలలో భాగస్వామ్యం వహించడం, మత ప్రచారాలు చేయడం నిషేధంగా ఉందని హోం మంత్రి పరమేశ్వర్ స్పష్టత ఇచ్చారు.
నాగుల చవితి సందర్భంగా విగ్రహాలుగా ఉన్న నాగదేవతలకు పుట్టల వద్ద పాములుపూసి పూజించడం ఆనవాయితీ. ఎక్కడైనా నిజమైన పాము కనిపిస్తే వెంటనే కొట్టి చంపే ప్రయత్నం చేయడం సహజం.
బీజేపీ చేపట్టిన చలో ధర్మస్థల.. అదొక రాజకీయ యాత్ర అని, తద్వారా ఎలాంటి లాభం లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కేవలం వారు రాజకీయలబ్ధికోసమే యాత్ర చేశారన్నారు. మైసూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ధర్మస్థల, చాముండి కొండలు, దసరా ఉత్సవాల విషయంలో బీజేపీ(BJP) బూటకపు నిరసన సాగిస్తోందన్నారు.
నగరంలో ఉత్సహంగా సాగుతున్న గణేశ్ ఉత్సవాల్లో సోమవారం తెల్లవారు జామున అపశ్రుతి చోటు చేసుకుంది. నగరంలోని గణేశ్ మండపం నుంచి నిమజ్జనానికి తరలిస్తున్న వినాయకుడి విగ్రహం ముందు డ్యాన్స్ చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
తుంగభద్ర నదికి నీరు ఎక్కువగా పోటు ఎత్తడం రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రతిసారి నదికి నీరు పోటెత్తడం వల్ల నది ఒడ్డున వుండే మోటార్లలో నీరు చేరుకుని మోటార్లు ధ్వంసమై రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
‘నాకు ఏమైనా జరిగితే అందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంద’ని చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర పప్పి పేర్కొన్నారు. అక్రమంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌ల ఆరోపణల మేరకు ఈడీ అధికారులు గత వారం దాడి చేసి రూ.12 కోట్ల నగదుతో పాటు కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
పుణ్యక్షేత్రం ధర్మస్థల పవిత్రతతకు భంగం కలిగించే సాగుతున్న కుట్రను అడ్డుకోవాలని కోరుతూ వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీకల్ రామచంద్రగౌడ మాట్లాడుతూ.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే హిందూదేశంలో హిందువులు పరాయివారువలే బతికే రోజులు ఎంతోదూరం లేదని విచారం వ్యక్తం చేశారు.
ధర్మస్థళలో పుర్రె వివాదం సంచలనం కలిగిస్తుండగా నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోవిందశెట్టిపాళ్య చెత్తకుప్పలో మనిషి పుర్రెతోపాటు ఎముకలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం ఉదయం స్థానికులు గమనించి పరప్పన అగ్రహార పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలపై, పదవులను కాపాడుకోవడంపై ఉన్న ఆసక్తి రైతులపై కానీ, ప్రాజెక్టులపై కానీ లేదని ప్రతిపక్షనాయకులు అశోక్ మండిపడ్డారు. సోమవారం తుంగభద్ర డ్యామ్‌ను బీజేపీ నాయకుల బృందం పరిశీలించింది.