• Home » Bellampalli

Bellampalli

సింగరేణి రిటైర్డ్‌ కార్మికుల ఆందోళన

సింగరేణి రిటైర్డ్‌ కార్మికుల ఆందోళన

బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి రిటైర్డు కార్మికులు సింగరేణి క్వార్టర్లలో విద్యుత్‌ పునరుద్ధరించాలని మంగళవారం ఆందోళన చేపట్టారు. రెండు రోజుల నుంచి పట్టణంలోని వివిధ వార్డుల్లో సింగరేణి యాజమాన్యం క్వార్టర్లకు విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగిస్తోంది.

ఉన్నత చదువులు చదివి ఉత్తమపౌరులుగా ఎదగాలి

ఉన్నత చదువులు చదివి ఉత్తమపౌరులుగా ఎదగాలి

గిరిజన గూడాల్లోని యువకులు ఉన్నత చదువులు చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని బెల్లంపల్లి ఏసీపీ రవికు మార్‌ అన్నారు. సోమవారం దేవాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాత తిర్మలాపూర్‌లో నిర్వహించిన పోలీ సులు మీ కోసంలో మాట్లాడారు. చదువు వల్ల సమా జంలో గౌరవం లభిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరు చదువు కుని ఉన్నత ఉద్యోగాలు చేయాలని సూచించారు.

క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం

క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం

క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని సివిల్‌ జడ్జి ముఖేష్‌, ఏసీపీ రవికుమార్‌లు అన్నారు. ఆదివారం ఏఎంసీ క్రీడా మైదానంలో న్యాయవాదులకు, పోలీసుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహిం చారు.

క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలి

క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలి

క్రీడల ను ప్రతీ ఒక్కరు వారి జీవితంలో భాగం చేసుకో వాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. మూడు రోజు లుగా పట్టణంలోని తిలక్‌ మైదానంలో నిర్వహిస్తున్న 9వ జాతీయ సాఫ్ట్‌ బేస్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీ లు గురువారం ముగిశాయి. విజేతల బహుమతి కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజర య్యారు.

Hyderabad: సికింద్రాబాద్‌-ముజాఫర్‌పూర్‌ మధ్య వీక్లీ స్పెషల్స్‌ రైలు

Hyderabad: సికింద్రాబాద్‌-ముజాఫర్‌పూర్‌ మధ్య వీక్లీ స్పెషల్స్‌ రైలు

సికింద్రాబాద్‌-ముజాఫర్‌పూర్‌(Secunderabad-Muzaffarpur) మార్గంలో జనవరి 7నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు(కొద్దిరోజులు మినహా)వీక్లీ స్పెషల్‌ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

ప్రారంభమైన   జాతీయస్థాయి సాఫ్ట్‌ బేస్‌బాల్‌ పోటీలు

ప్రారంభమైన జాతీయస్థాయి సాఫ్ట్‌ బేస్‌బాల్‌ పోటీలు

బెల్లంపల్లి పట్టణంలో జాతీయ స్థాయి సాఫ్ట్‌ బేస్‌బాల్‌ పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని తిలక్‌ క్రీడా మైదానంలో 9వ సాఫ్ట్‌ బేస్‌బాల్‌ సబ్‌ జూనియర్‌ యూత్‌ అండ్‌ గర్ల్స్‌ నేషనల్‌ చాంపియన్‌ పోటీలను ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ ప్రారంభించారు.

  ప్రజలు అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలి

ప్రజలు అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలి

అత్యవసర సమయంలో ప్రజలు అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి అన్నారు. సోమవారం రైతువేదిక ప్రాంగణంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి 108 అంబులెన్స్‌ను ప్రారం భించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అంబు లెన్స్‌ను ప్రారంభించామన్నారు.

భీమారం చేరుకున్న ప్రజారగ్‌ జోల్‌ యాత్ర

భీమారం చేరుకున్న ప్రజారగ్‌ జోల్‌ యాత్ర

సామాజిక న్యాయం, రాజ్యాధికారం లక్ష్యంతో కొనసాగుతున్న ప్రజారగ్‌ జోల్‌ యాత్ర ఆదివారం భీమారం చేరుకుంది. సేవాలాల్‌ సేన రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబునాయక్‌, సెంట్రల్‌ కమిటీ చైర్మన్‌ ప్రేమ్‌చంద్‌నాయక్‌, జిల్లా అధ్యక్షుడు గుగులోత్‌ మల్లేష్‌ నాయక్‌ అంబేద్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేశారు.

పోలీసులు క్రీడల్లో రాణించాలి

పోలీసులు క్రీడల్లో రాణించాలి

పోలీసులు క్రీడల్లో రాణించా లని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ అన్నారు. ఆదివారం ఎఎంసీ క్రీడా మైదానంలో సబ్‌ డివిజన్‌ స్థాయి పోలీసుల క్రికెట్‌ పోటీలను నిర్వహిం చారు. ఏసీపీ మాట్లాడుతూ రోజు పోలీసులు విధి నిర్వహణలో భాగంగా ఒత్తిడికి గురవుతారని, క్రీడలతో మానసిక ఉల్లాసంతోపాటు శారీరక ధారుడ్యం పెరుగుతుందన్నారు.

రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలన

రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలన

ఇందారం బస్టాండ్‌ వద్ద శుక్రవారం రాత్రి బైక్‌ ఢీకొని సుంకరి మల్లయ్య అనే రిటైర్డు కార్మికుడు మృతిచెందగా ఆదివారం ప్రమాదం జరిగిన స్థలాన్ని సీఐ వేణుచందర్‌ పరిశీలించారు. సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారని కానీ కనెక్షన్‌ ఇవ్వ కపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి