Home » Asaduddin Owaisi
హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పోలీసులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారా..? లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు చేతలో ఉన్నారా...? అని మండిపడ్డారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాతబస్తీలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం నిర్వహించారు. ఈ సారి మజ్లీస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ‘ మీ ఓటు మజ్లీస్ కోసం కాకున్నా మసీదుల కోసం వేయండి. ఈ సారి తమ పార్టీకి ఓటు వేయకుంటే ప్రార్థనా మందిరాలను లాక్కుంటారు అని సంచలన ఆరోపణలు చేశారు.
ఎన్నికల అఫిడవిట్లలో అభ్యర్థుల ఆస్తులు, అప్పుల లెక్కలు లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటిదాకా నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో దాదాపు అందరూ కోటీశ్వరులే ఉన్నారు.
Telangana: ‘‘కొంతమంది మా బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారు.. జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్ ఇచ్చి.. మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోంది’’ అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడమే కాకుండా హెచ్చరికలు కూడా చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తులేదని, ఎలాంటి అవగాహన కుదుర్చుకోలేదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు తెలిపారు. మజ్లిస్ ఏ పార్టీకీ బీ టీం కాదని స్పష్టం చేశారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. అధికార బీజేపీని ఢీ కొట్టడమే ధ్యేయంగా తమిళనాడులో రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయ్యాయి. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, జాతీయ పార్టీ ఏఐఎంఐఎం(AIMIM)లు పొత్తుకు సిద్ధమయ్యాయి.
రంజాన్ మాసం ముగియడంతో మజ్లిస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) వందలాది మంది కార్యకర్తలను వెంట తీసుకుని బహదూర్‌పురా(Bahadurpura) శాసనసభ నియోజకవర్గంలోని కామాటిపురా, ఉస్మాన్‌బాగ్‌లతో పాటు బొందలగూడ ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై స్టే విధించాలని కోరుతూ AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రం మార్చి 11న పౌరసత్వ (సవరణ) చట్టం, 2019ని అమలు చేసి.. నాలుగు నిబంధనలను నోటిఫై చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి మొండి ఘటం అని, పోరాడి అధికారం సాధించుకున్నారని అసదుద్దీన్ అభిప్రాయ పడ్డారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అంటోన్న సంగతి తెలిసిందే. అసదుద్దీన్ ఒవైసీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో ఉంటుందని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సీఎం రేవంత్ పట్టుదలతో ముఖ్యమంత్రి పదవిని సాధించారని ఎంపీ అసదుద్దీన్(Asaduddin Owaisi) అన్నారు. పాతబస్తీలో మెట్రో శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్(CM Revanth Reddy)తో పాటు ఎంపీ అసద్ పాల్గొన్నారు.