Home » Arunachal Pradesh
ముఖ్యమంత్రి పేమా ఖండూ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో అధికారం నిలబెట్టుకుంది. ఆదివారంనాడు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 60 నియోజకవర్గాల్లో 46 స్థానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 2019లో సాధించిన 41 స్థానాల రికార్డను కూడా బద్ధలుకొట్టింది.
సిక్కింలో అధికారంలో ఉన్న క్రాంతికారీ మోర్చా(SKM) సిక్కింలో క్లీన్ స్వీప్ అంచున ఉండగా, అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.
సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 6గంటలకే ప్రారంభమైంది. సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(SKM) పార్టీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో 32స్థానాల్లో 30స్థానాలకు ట్రెండ్ వెల్లడైంది. 29స్థానాల్లో ఎస్‌కేఎం, 1స్థానంలో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.
సినిమా విడుదలయ్యే ముందు ట్రైలర్ విడుదలైనట్లు.. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ క్రమంలో మరికాసేపట్లో పలు సర్వే సంస్థలు, వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల ద్వారా ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించనున్నాయి.
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 4వ తేదీన వెలువడనుండగా, దీనికి రెండ్రోజుల ముందుగానే జూన్ 2వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ , సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలోని 32 నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని 8 కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 2.00 గంటల మధ్య ఈ రీపోలింగ్ నిర్వహించాలని స్పష్టం చేసింది.
వాస్తవాధీన రేఖ వద్ద డ్రాగన్ దేశం నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టింది. ఈ చర్యను భారత్ ( India ) తీవ్రంగా ఖండిస్తోంది. ఇలా ఇప్పడే కాదు గతంలోనూ పలు మార్లు పేర్లు మారుస్తూ మూడు జాబితాలను రిలీజ్ చేసింది.
అరుణాచల్ ప్రదేశ్ కేంద్రంగా చైనా, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇండియాలోని కొన్ని ప్రాంతాలకు డ్రాగన్ కంట్రీ పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన భారత్ ఇలాంటి చర్యలు మానుకోవాలని చైనాకు సూచించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమని, చైనా పెడుతున్న ఈ పేర్లు వాస్తవాలను మార్చలేదని భారత్ ఘాటుగా స్పందించింది.
ఇటివల కేంద్ర ఎన్నికల సంఘం(election commission of india) లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగకుండానే బీజేపీ(BJP) 10 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ(Pema Khandu)తో సహా మొత్తం 10 మంది బీజేపీ అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు.
అరుణాచల్ ప్రదేశ్ తమదేనన్న చైనా వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఖండించిన నేపథ్యంలో చైనా మరోసారి రెచ్చిపోయింది.