Home » AP Police
కువైట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మహిళకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఆదేశించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని యర్రగొండపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆంజనేయులు అనే యువకుడిని అత్యంత కిరాతకంగా ఓ వ్యక్తి హత్య చేశాడు.
ప్రజలకు చేరువగా ఉండేందుకు హైవే పక్కన పోలీసుస్టేషన్‌లను ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ నియంత్రణకు అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగిస్తామని పేర్కొన్నారు.
పల్నాడు జిల్లాలో రాకెట్ ల్యాబ్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో విడతల వారీగా రూ.25 కోట్ల వరకు వస్తాయని నమ్మబలికి వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనేడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నవవధువు సత్యంశెట్టి వెంకటలక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో జై భారత్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.
విజయవాడలో ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి విజయవాడలో నిందితులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రజావ్యతిరేక సంస్కృతి పెరిగిందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఆగ్రహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలోని ఎస్.కొండేపాడు గ్రామంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. బజ్జీలు తిన్న అనంతరం 13 మంది ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.
విజయవాడలోని పటమటలంక ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రత్యూష అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.