Home » AP Employees
ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం మెరుపు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఒకే రోజు ఇద్దరు ప్రభుత్వోద్యోగుల ఇళ్లలో ఏకకాలంలో రైడ్స్ నిర్వహించారు.
నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ భవిష్యత్తుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 233, 234వ ఎస్ఎల్‌బీసీ సమావేశం శుక్రవారం జరిగింది. ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu), మంత్రులు, అధికారుల బృందం ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం దావోస్ బయలుదేరారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో సోమవారం సమీక్షా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, శాఖాధిపతులు హాజరయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయమవుతోంది. ఎప్పుడిస్తారో తెలీదు అస్సలు ఇస్తారో.. లేదో, కూడా తెలీదు. విషయం ఉన్నతాధికారుల నుంచి హెచ్ఎంల వరకు అందరికీ తెలిసినా ఎవ్వరూ నోరుమెదపరు. బిల్లులు మాత్రం ఎంచక్కా ఇచ్చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ పరిపాలన విభాగంలో కీలక బదిలీలు చోటుచేసుకున్నాయి. ఏపీ సర్కార్ మొత్తం 11 మంది మున్సిపల్ కమిషనర్లకు సంబంధించిన బదిలీలు, కొత్త పోస్టింగ్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.
అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా రావడంతో ఏసీబీ సోదాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఆయన ఇరిగేషన్ అధికారులపై బహిరంగంగా తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగినట్లు సమాచారం.
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. చైల్డ్ కేర్ లీవ్ వినియోగంపై పిల్లల వయో పరిమితిని పూర్తిగా తొలగిస్తూ జీవో జారీ చేసింది. ఇకపై మహిళా ఉద్యోగులు, ఇంకా, ఒంటరి పురుష ఉద్యోగులు..