Share News

AP Govt Employees sangam: రాజకీయ నాయకులు భుజాన చేయి వేసినంత మాత్రాన నేతలు కాలేరు

ABN , Publish Date - May 29 , 2024 | 08:28 PM

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంక్రటామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే.ఆర్. సూర్యనారాయణ మండిపడ్డారు. బుధవారం అమరావతిలో సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగులతో తాము అంతర్గతంగా సమావేశం పెట్టుకుంటే తమపై చర్యలు తీసుకోవాలని ఈసీ సీఈవో మీనాకు వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేయడంపై ఆయన అభ్యంతరం తెలిపారు.

AP Govt Employees sangam: రాజకీయ నాయకులు భుజాన చేయి వేసినంత మాత్రాన నేతలు కాలేరు
K R Suryanarayana

అమరావతి, మే 29: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంక్రటామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే.ఆర్. సూర్యనారాయణ మండిపడ్డారు. బుధవారం అమరావతిలో సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగులతో తాము అంతర్గతంగా సమావేశం పెట్టుకుంటే తమపై చర్యలు తీసుకోవాలని ఈసీ సీఈవో మీనాకు వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేయడంపై ఆయన అభ్యంతరం తెలిపారు.

Also Read: కరణ్ కాన్వాయి ఢీకొని ఇద్దరు మృతి


పోలింగ్ ముగిసిన అనంతరం ఉద్యోగ సంఘాలు సమావేశాలు పెట్టుకోవద్దని ఎక్కడా లేదని స్పష్టం చేశారు. గత అయిదేళ్లుగా తాము పడుతున్న ఇబ్బందులపై సమావేశాలు పెట్టుకోకూడదా? అంటూ వెంకట్రామిరెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తమ సంఘానికి అర్హత లేదని చాలా కాలంగా వెంకట్రామిరెడ్డి చెబుతూ వస్తున్నారన్నారు. మరి తమ సంఘాన్ని రద్దు చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారంటూ ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని సూర్యనారాయణ సూటిగా ప్రశ్నించారు.

Also Read: వైద్యారోగ్య శాఖ మంత్రి ఓఎస్డీపై సస్పెన్షన్ వేటు..!


రాజకీయ నాయకులు భుజాన చేయి వేసినంత మాత్రాన నాయకులు కాలేరంటూ వెంకట్రామిరెడ్డికి చురకలంటించారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వడం కూడా రాజు గారి దయ అయిపోయిందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. అయితే ఉద్యోగుల జీతాల కోసం గతంలో తాము రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశామని గుర్తు చేశారు. ఆ క్రమంలో ఈ ప్రభుత్వం తమకు తాఖీదు ఇచ్చిందని సూర్యనారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Also Read: మంచినీటిని వృధా చేస్తే.. రూ. 2 వేలు ఫైన్


ఇక ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ఏపీ టీచర్స్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్‌పై విద్యాశాఖను జేడీ అభిప్రాయం తీసుకోవడం దారుణమన్నారు. అందుకోసం ఆ శాఖ జేడీ రామలింగం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇది ఎన్నికల కోడ్‌కు పూర్తి విరుద్దమని చెప్పారు. తక్షణం జేడీపై చర్యలు తీసుకోవాలని ఈసీ సీఈవో ఎం.కె. మీనాను కలిసి ఫిర్యాదు చేశామని కే.ఆర్. సూర్యనారాయణ వివరించారు.

Also Read: ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

For More National News and Telugu News..

Updated Date - May 29 , 2024 | 08:28 PM