Home » AP Election 2024
| పార్టీ | ఆదిక్యం | గెలుపు | మొత్తం |
|---|---|---|---|
టీడీపీ + |
0 | 0 | 0 |
వైఎస్ఆర్‌సీపీ
|
0 | 0 | 0 |
కాంగ్రెస్ పార్టీ
|
0 | 0 | 0 |
ఇతరులు |
0 | 0 | 0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
151 |
తెలుగుదేశం పార్టీ |
23 |
జనసేన పార్టీ |
1 |
భారతీయ జనతా పార్టీ |
0 |
భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ |
0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
తెలుగుదేశం పార్టీ |
102 |
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
67 |
భారతీయ జనతా పార్టీ |
4 |
ఇతరులు |
2 |
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమన్వయం పాటించాలని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) సూచించారు. ఎన్నికల కౌంటింగ్ ఏజంట్లతో ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం సమావేశమయ్యారు.
మరికొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలవనున్న నేపథ్యంలో ఈ రోజు (సోమవారం) ఆంధప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముకేశ్ కుమాన్ మీనా (Mukesh Kumar Meena) కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుందని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో జూన్ 4న ఓట్ల కౌంటింగ్(Counting of Votes) సందర్భంగా జిల్లా పోలీసులు(Palnadu Police) అప్రమత్తం అయ్యారు. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
అధికారం పోతోందని వైసీపీ మంత్రులు, సలహదారులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు (AP Election Results) మంగళవారం నాడు (జూన్-04న) రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఒక్కసారిగా ఏపీలో సీన్ మొత్తం మారిపోయింది. ఇక ఎగ్జాక్ట్ ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా..? అని ఎదురుచూస్తున్న పరిస్థితి..
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళగిరిలోని ఎన్డీఆర్ భవన్‌కు సోమవారం వచ్చారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పోలీసులు గౌరవ వందనం పలికారు. ‘జై చంద్రబాబు.. సీఎం చంద్రబాబు’ అంటూ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.
సార్వత్రిక ఎన్నికల ఓట్లతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను మంగళవారం లెక్కించనున్నారు. అందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ఏపీ ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్‌కు నియమించుకొనేందుకు రాజకీయ పార్టీలకు ఈసీ అనుమతి ఇచ్చింది.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం మాచర్ల నియోజకవర్గానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.
చంద్రగిరి నియోజకవర్గంలో ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్ల విషయంలో మరోసారి స్క్రూటినీ చేయాలని, నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాము జోక్యం చేసుకునేందుకు కరణాలేవి కనిపించడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ బూత్‌లలో అక్రమాలు జరిగాయని మోహిత్ రెడ్డి చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు-2024, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు (మంగళవారం) వెల్లడి కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.